‘హనుమాన్’ (HanuMan) సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా ఇతను పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ‘అ!’ (Awe) ‘కల్కి’ ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) వంటి వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ కోసం 3 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈరోజుల్లో డైరెక్టర్స్ కి కావాల్సింది టెక్నికల్ నాలెడ్జ్ అని, అది ఉంటే కచ్చితంగా తక్కువ బడ్జెట్లో క్వాలిటీతో కూడుకున్న సినిమాలు తీయొచ్చు అని ప్రశాంత్ వర్మ చాటి చెప్పాడు.
‘హనుమాన్’ కి రూ.50 కోట్ల లోపే బడ్జెట్ అయ్యింది. అది ఒక రికార్డు. రిలీజ్ తర్వాత ఆ సినిమా రూ.325 కోట్లు కలెక్ట్ చేసింది. అది మైండ్ బ్లోయింగ్ రికార్డు. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టించాలో ప్రశాంత్ వర్మకి బాగా తెలుసు. ఇదిలా ఉండగా.. ‘హనుమాన్’ తర్వాత నెక్స్ట్ మూవీ ‘జై హనుమాన్’ ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు ప్రశాంత్ వర్మ.
కానీ ఆ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. వాళ్లందరి కాల్షీట్లు పట్టుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం కష్టం. అందుకే ‘జై హనుమాన్’ ని పక్కకి పెట్టి అనుపమతో (Anupama Parameswaran) ఓ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్. వాస్తవానికి ఇది ‘హనుమాన్’ కంటే ముందే మొదలైంది.50 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.
కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. ఈ సినిమా పేరు ‘ఆక్టోపస్’. ఇదొక విమెన్ సెంట్రిక్ మూవీ.’ ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ ఇలాంటి సినిమా చేయడమేంటి?’ అనే ఆలోచన అందరికీ రావచ్చు. అందుకే వెంటనే ఈ సినిమాని రిలీజ్ చేయకుండా.. ముందుగా చిత్రోత్సవాలకు పంపి తర్వాత రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ వర్మ ఆలోచనగా తెలుస్తుంది.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?