Prasanth Varma: వైరల్ అవుతున్న ప్రశాంత్ వర్మ ట్వీట్.. ఆ వ్యక్తి ఎవరంటే?

  • March 21, 2024 / 11:58 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. హనుమాన్ సినిమా ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల విషయంలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ తర్వాత ప్రశాంత్ వర్మ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ అవుతుండటం గమనార్హం. ప్రశాంత్ వర్మకు స్టార్ హీరోల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రశాంత్ వర్మ కొత్త డైరెక్టర్ సెట్ లో ఉన్నాడని ఫేమస్ లైన్ తో వైరల్ అయిన ఈ వ్యక్తిని గుర్తు పట్టారా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్ మూవీ తీసినోడు నా కొడుకు అంటూ ప్రశాంత్ వర్మ తండ్రి గతంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్ (HanuMan)  మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5 ఓటీటీలో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఇక్కడ కూడా హిట్ గా నిలిచింది. హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ కోసం ఎక్కువమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ స్వయంగా క్లారిటీ ఇస్తే జై హనుమాన్ సినిమాకు సంబంధించిన సందేహాలకు జవాబు దొరకనుంది.

జై హనుమాన్ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తే బాగుంటుంది. జై హనుమాన్ మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జై హనుమాన్ రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus