Prashanth Neel, Prabhas: ప్రభాస్ తీరు చూసి ఆశ్చర్యమేసింది!: ప్రశాంత్ నీల్

  • December 26, 2023 / 11:29 AM IST

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించినటువంటి తాజా చిత్రం సలార్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటిరోజు సుమారు 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ సినీ కెరియర్ ముగిసిపోతుంది అన్న వారందరికీ సలార్ సినిమాతో గట్టి సమాధానం ఇచ్చారు హీరో ప్రభాస్. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కటౌట్ కి అదిరిపోయే సినిమాని ఎంపిక చేసుకొని ఈ సినిమా ఎంతో గొప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కూడా భావిస్తున్నారు ఇక ఈ సినిమా తరువాత పార్ట్ 2 పై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ గురించి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి తాను ఈ సినిమా కథ మొత్తం ప్రభాస్ కి చెప్పలేదని ప్రశాంత్ వెల్లడించారు.

తాను స్టార్టింగ్ అలాగే క్లైమాక్స్ సీన్స్ మాత్రమే చెప్పానని దీంతో ఈయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రశాంత్ వెల్లడించారు అయితే సినిమా షూట్ చేస్తున్న సమయంలో నాకు ప్రభాస్ తీరు నచ్చలేదని ఒక విషయంలో ప్రభాస్ అసలు నచ్చరు అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఒకసారి హీరోతో సినిమా చేస్తున్నాము అంటే ఆ సినిమా గురించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా అడిగి తెలుసుకుంటారు.

ఈ సన్నివేశం తర్వాత మరే సీను వస్తుందన్న విషయాలన్నింటినీ కూడా డైరెక్టర్ ను అడుగుతూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇలాంటి ప్రశ్నలు అస్సలు వేయలేదట. డైరెక్టర్ చెప్పినట్టు తాను నటిస్తున్నాడని ఇలాంటి ఒక స్టార్ హీరో డైరెక్టర్ చెప్పిన మాట వినడం చూసి నేను ఆశ్చర్యపోయానని ఈ విషయం నాకు నచ్చలేదు అంటూ ప్రశాంత్ (Prashanth Neel) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus