Prashanth Neel: నీల్‌ మళ్లీ అదే పని చేస్తున్నారా? ఇలా అయితే ఎన్నేళ్లు పడుతుందో?

ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) రాసే సినిమాలు తొలుత నుండి రెండు పార్టులు ఉంటాయా? లేక రాశాక రెండు పార్టులు చేస్తారా? ‘ఇప్పుడు ఇదేం ప్రశ్న.. తారక్‌ (Jr NTR) సినిమా కూడా రెండు పార్టులా’ అనే ప్రశ్న వేద్దాం అనుకుంటున్నారా? అయితే వేసేయండి. ఎందుకంటే ఇక్కడ విషయం అదే. తారక్‌ 31వ సినిమా అంటూ అనౌన్స్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఇప్పుడు 31 అండ్‌ 32 అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పుడే ప్రకటన రాకపోవచ్చు కానీ… విషయం అయితే ఇదే అని చెబుతున్నారు.

గత రెండు రోజులుగా ఈ విషయమ్మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్‌ మడియాలో. తారక్‌ సినిమా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌… ఈ సినిమాకు ఒక పార్టు సరిపోదు అని నిర్ణయానికి వచ్చారట. తారక్‌ కోసం నీల్‌ సిద్ధం చేస్తున్న ప్రపంచం, పాత్రలు ఒక పార్టులో చూపిస్తే కుదరదని, పూర్తిగా ఎక్స్‌ప్లోర్‌ చేయాలంటే రెండు పార్టులు కావాలని అనుకుంటున్నారట. అయితే ఇప్పుడు ‘దేవర’ (Devara)  ఇలా రెండు పార్టులుగా చేస్తున్న తారక్‌… ఏమంటాడో చూడాలి.

అయితే కథ అంతలా ఉంది అంటే తారక్‌ అయినా ఏం చేస్తాడు. ‘కేజీయఫ్‌’(KGF), ‘సలార్‌’ (Salaar) రూపంలో రెండు పార్టుల సినిమాలు చేసిన ప్రశాంత్‌ నీల్‌… ‘ఉగ్రం’ సినిమాకు కూడా మరో పార్టు చేస్తారు అంటున్నారు. దీంతో ఒక పార్టు సినిమాలు ప్రశాంత్‌ చేయరా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అసలు తారక్‌ సినిమా ఎప్పుడు ప్రారంభం అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ‘సలార్‌ 2’ చేశాక ప్రశాంత్‌ తారక్‌ సినిమా చేస్తారని తాజా కబురు. మరోవైపు ‘దేవర 2’ కూడా పూర్తవ్వాలి.

దీంతో తారక్‌ – ప్రశాంత్‌ సినిమా మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఆ క్లారిటీ వచ్చాక ఒక పార్టా, రెండు పార్టులా అనేది అడగొచ్చు. అయితే ‘కేజీయఫ్‌ 3’ కూడా ఉంటుందని ఆ మధ్య చెప్పారు. మరి అదెప్పుడు ప్రారంభమవుతుందో?

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus