ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ 90 శాతం మంది అభిమానులకు నచ్చగా 10 శాతం మంది అభిమానులకు మాత్రం నచ్చలేదు. మరోవైపు ప్రమోషన్స్ లేకపోవడం వల్లే సలార్ మూవీకి కలెక్షన్లు తగ్గాయని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. సలార్ వర్సెస్ డంకీ పోటీ గురించి సైతం ప్రశాంత్ నీల్ రియాక్ట్ అయ్యారు.
ఫ్యాన్స్ మధ్య గొడవలను తాను ప్రోత్సహించనని అలాంటివి వినడానికి కూడా ఇష్టపడనని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. ఇలాంటి ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదని ఆయన అన్నారు. కళాకారులు ఒకరితో ఒకరు పోటీ పడరని అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారని ప్రశాంత్ నీల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సలార్, డంకీ సినిమాల మధ్య ప్రతికూల వాతావరణం ఉండాలని నేను అనుకోలేదని డంకీ ప్రొడ్యూసర్స్ కూడా మనలా ఆలోచించాలని ఆయన అన్నారు.
మనమందరం ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నామని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ ఉండే క్రికెట్ మ్యాచ్ అని ఆయన వెల్లడించారు. ప్రశాంత్ నీల్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డంకీతో పోటీ లేకుండా సలార్ సోలోగా రిలీజై ఉంటే సలార్ సినిమాకు మరింత ప్రమోషన్స్ చేస్తే మరింత బెటర్ కలెక్షన్లు వచ్చేవని ప్రచారం జరిగేది కాదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
సలార్ సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పారితోషికం మరింత పెరిగిందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సలార్2 మూవీ రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!