ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సలార్ సినిమా బిజినెస్ లాభాల్లో కొంతమేర ప్రశాంత్ నీల్ కు వాటా రూపంలో దక్కనుందని తెలుస్తోంది.
ఈ విధంగా ప్రశాంత్ నీల్ కు భారీ స్థాయిలో పారితోషికం దక్కనుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ప్రతి సినిమాకు ప్రశాంత్ నీల్ ఇదే విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రశాంత్ నీల్ కు లాభాలు అంత మొత్తం పెరుగుతాయి. ప్రశాంత్ నీల్ ప్రముఖ దర్శకులలో ఒకరు కాగా ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎన్టీఆర్ సినిమాకు సైతం ఇదే విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మద్యం తాగి సీన్లు రాసే ప్రశాంత్ నీల్ ఆ సీన్లు ఊహలకు అందని విధంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తక్కువ సమయంలోనే షూటింగ్ లను పూర్తి చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకున్న ప్రశాంత్ నీల్ తన సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2024 ఏప్రిల్ లో మొదలు కానుండగా ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. సలార్2, కేజీఎఫ్3 సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.