Hanu Man: తీసినోడు నా కొడుకు… ప్రశాంత్‌ తండ్రి ఆనందం చూశారా?

  • January 16, 2024 / 11:53 AM IST

పుత్రోత్సాహం అంటే ఏంటో తెలుసా? మాకు తెలిసి చాలామంది దాని అర్థం తెలిసే ఉంటుంది. కొడుకు ఎదుగుదలను చూసినప్పుడు కలిగే ఆనందాన్నే పుత్రోత్సాహం అని అంటారు. దీనికి నిలువెత్తు ఉదాహరణను మనం చాలా సార్లు చూసే ఉంటాం. మీ ఇంట్లో కొడుకులు ఉంటే మీరు కూడా చూసే ఉంటారు. అయితే దానికి మాస్‌ రీతితో నిలువెత్తు ఉదాహరణ కావాలి అనుకుంటే ఈ దిగువ వీడియో చూడాల్సిందే. సినిమాటిక్‌గా కనిపించినా… ఈ వీడియో అద్భుతం అని చెప్పాలి.

ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మను చూసి టాలీవుడ్డే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమ గర్వపడుతోంది. ‘హను – మాన్‌’ అంటూ సంక్రాంతికి వచ్చిన ఆయన అదిరిపోయే విజయం అందుకున్నారు. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో పెట్టిన ఖర్చును వెనక్కి తెచ్చేసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద పబ్లిక్‌ టాక్‌ తీసుకుంటున్న యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లకు ఓ పెద్దాయన షాక్‌ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు ప్రశాంత్‌ వర్మ తండ్రి.

‘హను – మాన్‌’ (Hanu Man) సినిమా చూసి థియేటర్‌ నుండి బయటకు వస్తున్న ప్రశాంత్‌ తండ్రి నారాయణ రాజు (సమాచారం)ను ఓ మీడియా వ్యక్తి సినిమా ఎలా ఉంది అని అడిగారు. అయితే అప్పటికి ఆయన ప్రశాంత్‌ తండ్రి అని తెలియదు. దానికి ఆయన ‘సినిమా అదిరిపోయింది. ఈ సినిమా తీసింది నా కొడుకు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ‘మీ అబ్బాయేనా ఇప్పుడు చెప్పండి తండ్రిగా మీ ఫీలింగ్‌’ అంటూ మరిన్ని ప్రశ్నలు వేశారు. వాటిని ఆయన సమాధానాలు చెబుతున్నప్పుడు కళ్లలో ఆ వెలుగు చూస్తే వావ్‌ అనిపించకమానదు.

ఓ సాధారణ ప్రేక్షకుడిలా ఆయన సినిమాను చూడటం, వచ్చిన ఇలా మాట్లాడటం చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా విజయంతో ఇతర సినిమాల థియేటర్లను సైతం ఈ చిత్రానికి ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అది కనిపిస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus