ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ‘పెళ్ళాం ఊరెళితే’ ఫేమ్ ప్రశాంతి హారతి కూతురి డాన్స్ వీడియో

2003 లో శ్రీకాంత్, వేణు హీరోలుగా వచ్చిన ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో సునీల్ భార్యగా నటించిన నటి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సునీల్ ఈమెను అమాయకురాలిని చేసి ఆడిస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ నవ్విస్తాయి. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో కూడా ఈమె నటించింది. ఆ సినిమాలో షౌకత్ అలీ ఖాన్ కూతురి పాత్రలో ఈమె కనిపిస్తుంది. ఈమె పేరు ప్రశాంతి హారతి.తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు.

పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించింది. ఆమె కూతురు తాన్యా హారతికి కూడా ప్రశాంతి (Prashanthi Harathi) కూచిపూడి డాన్స్ నేర్పింది. ప్రశాంతి కూతురు తాన్యా హారతి ‘తెలుగింటి సంస్కృతి’ అనే పేరుతో ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ‘మనసంతా నువ్వే’ ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వి ఎన్ ఆదిత్య ఈ మ్యూజిక్ వీడియో కాన్సెప్ట్ ను డిజైన్ చేయడం జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘తెలుగింటి  సంస్కృతి’ మ్యూజిక్ వీడియోని లాంచ్ చేశారు.

యూట్యూబ్ లో ఈ మ్యూజిక్ వీడియోకి హాఫ్ మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. రాధాకృష్ణ హారతి దీనికి నిర్మాత కాగా మురళి రుద్ర, అన్వేష్ మావిళ్ళపల్లి, ఆనంద్ పవన్ నాయుడు ఎడిటర్స్ కాగా ఎస్ ఎ ఖుద్దూస్ సంగీతం అందించారు. శ్రీ రామ్ తపస్వి సాహిత్యం అందించారు. శ్రీనిధి ఈ పాటని ఆలపించడం జరిగింది. కిరణ్ గుడిపూడి కూడా ఈ వీడియోలో లీడ్ రోల్ పోషించారు. ఇక 20 ఏళ్ళ తర్వాత ప్రశాంతి హారతి ఈ వీడియో వల్ల వార్తల్లో నిలిచింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus