ప్రతి రోజు పండగే సినిమా మూల కథ ఆ ఫ్లాప్ సినిమాని గుర్తు చేస్తుంది

ఇవివి గారి చిత్రాల్లో కామెడీ, వినాయక్ సినిమాలో సుమోలు గాల్లో ఎగరడం ఎంత కామనో.. మారుతి సినిమాల్లో హీరోకి ఏదో ఒక రోగం ఉండడం కూడా అంతే కామన్. “భలే భలే మగాడివోయ్” చిత్రంలో హీరోకి మతిమరుపు, “శైలజారెడ్డి అల్లుడు” సినిమాలో అయితే హీరోహీరోయిన్ల కంటే ఈగోనే ప్రధాన పాత్ర పోషించింది. “మహానుభావుడు” సినిమాలో హీరోకి అతి శుభ్రత. ఇలా తన ప్రతి సినిమాలో హీరో లేదా హీరోయిన్ కి ఏదో ఒక వింత వ్యాధిని అంటించే మారుతి.. తాజా చిత్రం “ప్రతి రోజు పండగే”లో కూడా హీరో సాయిధరమ్ తేజ్ కి ఒక ప్రత్యేకమైన వ్యాధిని ఇచ్చాడట. దాంతో.. హీరో చనిపోతున్నామని బాధపడేకంటే, బ్రాతికన్నన్నాళ్లు ఆనందంగా బ్రతికితే “ప్రతిరోజూ పండగే” అనే థీమ్ తో బ్రతికేస్తుంటాడట. అదే సినిమా మూల కథ.

ఇది చదవంగానే మీకు ఏ సినిమా గుర్తొచ్చిందో తెలియదు కానీ.. మూల కథ మాత్రం ప్రభాస్ ఫ్లాప్ సినిమా “చక్రం”ను గుర్తుచేసింది. ప్రభాస్, అసిన్, ఛార్మీ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది కానీ.. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా మాత్రం మిగిలిపోయింది. మరి ప్రభాస్ కు డిజాస్టర్ ను అంటగట్టిన ఈ కాన్సెప్ట్ సాయిధరమ్ తేజ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus