ప్రత్యూష ఆత్మహత్య మిస్టరీగా మిగులుతుందా

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ ,టివీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు అతని బాయ్ ప్రెండ్ కారణం కాదని పోలీసులు తేల్చారు.మొదట రాహుల్ విచారణకు హాజరు కాలేదని వార్తలు వచ్చాయి. అయితే అతను విచారణకు హాజరయ్యాడని ,అందులో ఈమె ఆత్మహత్యకు , అతనికి సంబందం లేదని తేలిందని కధనాలు వస్తున్నాయి.ప్రత్యూష ఆర్దిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అబిప్రాయపడ్డారని సమాచారం.అంతేకాక ప్రత్యూష తల్లిదండ్రులు కూడా రాహుల్ పై ఫిర్యాదు చేయకపోవడం కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు.అయితే ప్రత్యూష స్నేహితులు కొందరు మాత్రం ఆమెకు ఆర్ధిక ఇబ్బందులు ఉండే అవకాశం లేదని వాదిస్తున్నారు.మొత్తం మీద ప్రత్యూష ఆత్మహత్య కూడా మిస్టరిగానే మిగిలిపోతుందా అన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus