Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘ప్రేమ విమానం’ మూవీ ఆడియెన్స్‌కి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది- అనసూయ భరద్వాజ్

‘ప్రేమ విమానం’ మూవీ ఆడియెన్స్‌కి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది- అనసూయ భరద్వాజ్

  • October 12, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రేమ విమానం’ మూవీ  ఆడియెన్స్‌కి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది- అనసూయ భరద్వాజ్

గూఢచారి, కేశవ, రావణాసుర వంటి సినిమాలతో పాటు డెవిల్, గూఢచారి 2 వంటి భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రీమియర్ షోని మంగళవారం మీడియాకు ప్రదర్శించారు.అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో…

డైరెక్టర్ సంతోష్ కాటా మాట్లాడుతూ.. ‘నేను విమానం ఇంత వరకు ఎక్కలేదు.. సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా.. సినిమా హిట్ అయితేనే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని అనుకున్నా. ఈ చిన్న పిల్లలు ఆ పాత్రలను అద్భుతంగా పోషించారు. నిర్మాత పిల్లలనే ఉద్దేశంతో సినిమాలోకి తీసుకోలేదు. ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు. పిల్లల నటన చూసి అభిషేక్ నామా గారు చాలా సంతోషించారు. విలేజ్‌కి వెళ్లి షూటింగ్ చేసినప్పుడు ఎన్నో సరదా సంఘటనలు, చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి. మేం ఎంత కష్టపడ్డా కూడా సినిమాను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా కష్టం అంతా ఎగిరిపోయినట్టుగా అనిపించింది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన జీ5 టీం, అభిషేక్ నామా గారికి థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన టీంకు థాంక్స్.

అనసూయ మాట్లాడుతూ.. ‘కొన్ని సార్లు దర్శకులు చెప్పిన కథకు, తీసిన దాంట్లో తేడా ఉంటుంది. కానీ సంతోష్ మాత్రం ఏం చెప్పాడో.. ఎలా చెప్పాడో అదే తీశాడు. మొదటి సినిమా దర్శకుడిలా కనిపించలేదు. సెట్‌లు ఎక్కువగా వేయలేదు. అంతా నేచురల్‌గా షూట్ చేశారు. చిన్న పిల్లలు షూటింగ్‌ను ఎంతో కష్టపడి చేశారు. నేను ప్రతీ సారి కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటూ వస్తాను. నా బలం గ్లామర్ అని కొంత మంది అంటారు. కొంత మంది తిడుతారు. సినిమాలో అయినా నిజ జీవితంలో అయినా ఆనందంగా ఉండేందుకు నాకు నచ్చిన పాత్రలు, పనులు చేస్తాను. ఈ సినిమా సెట్‌లో అంతా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. శాంత పాత్ర నాకు ఇచ్చినందుకు సంతోష్‌కు థాంక్స్. ఈ ప్రయాణం వల్ల ఈ చిత్రంతో ప్రేమలో పడిపోయాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. మా ప్రేమ విమానంను అక్టోబర్ 12న జీ5లో అందరూ వీక్షించండి’ అని అన్నారు.

జీ 5 కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘వెబ్ ఫిల్మ్స్ వద్దు అనుకున్న టైంలోనే సంతోష్ వచ్చి ఈ కథ చెప్పాడు. గట్టిగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది సంతోష్ నమ్మాడు. అందుకే ఈ ప్రేమ విమానం ఓకే అయింది. ఆయన రైటింగ్ ఎంతో బాగుంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించింది. మ్యాడ్ మూవీతో సంగీత్ శోభన్ ఆల్రెడీ థియేటర్లో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో హిట్టు ఇవ్వబోతోన్నాడు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రం’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ గాంధీ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సంతోష్ ఈ సినిమాను ఎంతో బాగా తీశాడు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడు కథ ఎలా చెప్పాడో.. తెరపై అలానే చూపించారు’ అని అన్నారు.

కెమెరామెన్ జగదీష్ చీకటి మాట్లాడుతూ.. ‘మా నిర్మాత అభిషేక్ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. ఫిల్మ్ మేకింగ్‌లో ఎన్నో విషయాలు చెప్పారు. నటీనటులంతా అద్భుతంగా పర్పామ్ చేశారు. అమర్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Prema Vimanam
  • #Sangeeth Shobhan

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

1 hour ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

5 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

7 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

10 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

10 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

7 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

7 hours ago
Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

7 hours ago
Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

8 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version