లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు వెర్షన్ ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 400 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి నటులు ఉండడంతో భారీ ఓపెనింగ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. పైగా సూర్య క్యామియో ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు.
క్యాస్టింగ్ పరంగా ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తున్నప్పటికీ.. ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందులో ‘ఎఫ్3’ ఒకటి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పెద్దగా నెగెటివ్ టాక్ లేదు కాబట్టి కలెక్షన్స్ స్టడీగా ఉండే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రెండు వారాల పాటు ఈ సినిమాకి స్ట్రాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా వలన ‘విక్రమ్’పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
రెండోది ‘మేజర్’ సినిమా. అడివి శేష్ నటించిన ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఓ రేంజ్ లో ఉంది. జాన్ 3నే ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది. అయితే సినిమాపై నమ్మకంతో ముందే కొన్ని ఏరియాల్లో ప్రీరిలీజ్ చేశారు. అలా సినిమాను ముందుగానే చూసిన ఆడియన్స్ కి ‘మేజర్’ తెగ నచ్చేసింది. ఇదిలా ఉంటే.. ‘విక్రమ్’ సినిమా సీరియస్ గా సాగే యాక్షన్ డ్రామా. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ తమిళ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సాగుతుంది.
అలా ఉంటే గనుక రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ను రికవర్ చేయడం ‘విక్రమ్’కు అంత ఈజీగా ఉండదు. మరి ఈ సవాళ్లను దాటుకొని ‘విక్రమ్’ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి!
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!