ఒక సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు మన హీరోలు. కొందరైతే ఏకంగా కుటుంబ సభ్యులు భయపడేలా కష్టపడుతుంటారు. ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా… రిస్క్‌లు చేస్తుంటారు. అమాంతం బరువు పెరిగిపోవడం, అమాతం తగ్గిపోవడం లాంటివీ చేస్తుంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఆ హీరో ఇంకా ఏదైనా సాధించాలనే నమ్మకం అందుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పొంది ఒక మంచి సినిమా చేసిన కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) .
‘ది గోట్ లైఫ్’ / ‘ఆడు జీవితం’(The Goat Life) సినిమా గురించే ఇదంతా మాట్లాడుతున్నాం. ఈ నెల 28న విడుదలవుతున్న ఈ సినిమా గురించి, దాని కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ పడ్డ కష్టం గురించి చాలాసార్లు చదువుకున్నాం. ఆ పాత్ర చిత్రణ, లుక్ చూస్తేనే చెప్పేయొచ్చు ఆయన ఎంత కష్టపడ్డారు. అయితే ఈ సమయంలో ఆయన ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయంలో ఆయన ఇటీవల మీడియా ముందుకొచ్చినప్పుడు వెల్లడించాడు.
వైవిధ్యభరితమైన పాత్రలకు, ప్రయోగాత్మక చిత్రాలకు పృథ్వీరాజ్ సుకుమారన్ పెట్టింది పేరు. ‘ది గోట్ లైఫ్’ / ‘ఆడు జీవితం’ అలాంటిదే. ఈ సినిమా కోసం ఆయన 16ఏళ్లు పని చేశారు. బ్లెస్సీ (Blessy) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే సర్వైవల్ థ్రిల్లర్ ఇది. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2018లో చిత్రీకరణను ప్రారంభించారు. అంతకుముందే సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైంది.
రాజస్థాన్ ఎడారిలో సినిమా షూట్ చేయాలని అనుకున్నారట. కానీ, అక్కడ అరబ్ దేశాల వాతావరణం కనిపించలేదని, అందుకే జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ చేశారట. ఆ సమయంలోనే లాక్‌డౌన్ వచ్చిందని, అప్పుటికి తామంతా జోర్డాన్‌లోనే ఉన్నామని పృథ్వీరాజ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిపేయడంతో అక్కడి నుండి బయట పడటానికి వీలు లేకపోయిందట. దాంతో అందరం రెండు నెలలు అక్కడే ఉన్నారట. అక్కడికి ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ చేశారట.
ఈ సినిమా కోసం తాము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో నడిపించిన గొప్ప విషయం… గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే అని పృథ్వీరాజ్ వెల్లడించాడు. నజీబ్ పాత్ర కోసం 31కిలోల బరువు తగ్గానని, ఆ సమయంలో తన ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని చెప్పాడు. అయితే తన భార్య, కుమార్తె తనను అర్థం చేసుకొని అండగా నిలిచారని గర్వంగా చెప్పాడు నజీబ్ అలియాస్ పృథ్వీరాజ్.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్