Prithviraj, Chiranjeevi: మెగాస్టార్ కు మలయాళ స్టార్ అందుకే నో చెప్పారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 66 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి యాక్టివ్ గా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. చిరంజీవి హీరోగా తెరకెక్కే ఒక్క సినిమాలో అయినా నటించాలని భావించే హీరోహీరోయిన్లు, చిరంజీవి హీరోగా తెరకెక్కే ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం వహించాలని చాలామంది డైరెక్టర్లు భావిస్తారు. అయితే మలయాళ హీరో, డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరంజీవి రెండుసార్లు ఛాన్స్ ఇచ్చినా ఆ ఛాన్స్ ను వదులుకున్నానని తెలిపారు.

సైరా నరసింహారెడ్డి సినిమాలోని కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ తనను సంప్రదించిందని ఆ సమయంలో తాను నటిస్తున్న మలయాళ మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతుండటంతో సైరా సినిమాకు నో చెప్పానని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ను తాను వదులుకున్నానని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.

ఆ సమయంలో తాను భారీ చిత్రాలతో బిజీగా ఉన్నానని ఆయన వెల్లడించారు. గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించడం సంతోషంగా ఉందని చిరంజీవి స్టార్ ఇమేజ్ కు లూసిఫర్ రీమేక్ సరిపోతుందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. భవిష్యత్తులో తాను లూసిఫర్2 తీస్తానని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.

లూసిఫర్2 సినిమా రీమేక్ లో చిరంజీవి నటిస్తానని చెబితే ఆ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ను వదులుకోనని తప్పకుండా దర్శకత్వం వహిస్తానని ఆయన వెల్లడించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో చిరంజీవి పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus