Rajinikanth: లోకేశ్‌ కనగరాజ్‌ మరో భారీ ప్లాన్‌… ఈ సారి ఏం అవుతుందో?

‘లియో’ సినిమా వచ్చేసింది. ఆ సినిమా ఫలితం గురించి, వసూళ్ల గురించి ఓ వైపు చర్చ నడుస్తోంది. ఇప్పుడు మనం ఆ టాపిక్‌లోకి వెళ్లడం లేదు. ఇప్పుడు టాపికల్లా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ నెక్స్ట్‌ సినిమా గురించే. అవును లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో నెక్స్ట్‌ వచ్చే సినిమా ఏంటి? ఎలా ఉండబోతుంది? ఎవరు నటిస్తారు లాంటి ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో హీరో ఎవరు అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రావాల్సిన క్లారిటీ అల్లా మిగిలిన నటులు ఎవరు అని. ఎందుకంటే ఇది లోకేశ్ సినిమాటిక్‌ యూనివర్స్‌లో సినిమా.

అంటే… ఎల్‌సీయూలోకి ఎవరు వచ్చినా వాళ్లకు ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ దొరుకుంది. అంతేకాదు ఆ తర్వాత ఎప్పుడో ఓసారి ఆ నటుడితో ఓ భారీ సినిమా ఉంటుంది కాబట్టి. ఇప్పటికే ఎల్‌సీయూలో వచ్చిన సినిమాలు, వాటి క్లారిటీలే మేం ఇలా అనడానికి కారణం. లోకేశ్‌ కనగరాజ్‌ తర్వాతి సినిమా రజనీకాంత్‌తో చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌ చేసేశారు కూడా. అయితే ఇందులో కీలక పాత్ర కోసం ఓ మలయాళీ సూపర్‌స్టార్‌ను అనుకుంటున్నారు అని ఓ టాక్‌ నడుస్తోంది.

మలయాళంలోనే కాదు… మొత్తంగా సౌత్‌లో స్టార్‌ హీరో స్టేటస్‌ అందుకున్నారు పృథ్వీరాజ్‌ సుకుమార్‌. అంతేకాదు స్టార్‌ దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. త్వరలో ‘సలార్’ సినిమాతో పాన్‌ ఇండియా యాక్టర్ అవ్వబోతున్నారు. ఆయన్నే రజనీకాంత్‌ తర్వాతి సినిమాలో కీలక పాత్ర కోసం అడిగారు అనే టాక్‌ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారు అని సమాచారం. ఈలోపు నటుల విషయంలో క్లారిటీ రావొచ్చని టాక్‌.

ఇక రజనీకాంత్‌ ప్రస్తుతం ‘జై భీమ్‌’ సినిమా ఫేమ్ టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇది కాకుండా ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీ (Rajinikanth) కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus