ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

రానున్న సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రానున్నాడు రవితేజ. పండగ సినిమాల మధ్యలో పోటీపడి చివర్లో బరిలో నిలుస్తుందా లేదా అనేది తెలియదు కానీ.. ఇప్పటికైతే ఆ సినిమా బరిలోనే ఉంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న రవితేజ.. మరోవైపు కొత్త సినిమాను స్టార్ట్‌ కూడా చేసేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన అప్‌డేట్‌ ఒకటి లీకు రూపంలో వచ్చింది.

Priya Bhavani

ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తారు అని తొలుత సమాచారం వచ్చింది. దీంతో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయితే అదేమీ లేదు.. అంతమంది హీరోయిన్లు లేరు అని టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తాజా సమాచారం. అందులో ఒక హీరోయిన్‌ సీనియర్ కాగా, రెండో హీరోయిన్‌ కాస్త కొత్త అమ్మాయి అవుతుంది అని సమాచారం. కొత్త హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ను తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో ఆమె పాల్గొంటున్నట్లు తెలిసింది.

టాలీవుడ్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా రవితేజకు పేరుంది. రీసెంట్‌ కెరీర్‌ చూస్తే మూడేళ్లయింది ఆయనకు హిట్‌ వచ్చి. ముఖ్య పాత్రలో అయితే రెండేళ్ల క్రితం విజయం అందుకున్నారు. ఈ ఏడాది ‘మాస్‌ జాతర’ అంటూ వాయిదాలు పడుతూ పడుతూ వచ్చి ఇబ్బందికర ఫలితమే అందుకుంది. ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ టచ్‌ ఇస్తున్నాడు. ఆ తర్వాత శివ ఇర్వాణ సినిమాతోనూ అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాడట.

ఒక హీరోయిన్‌ చెప్పాం.. ఇంకో హీరోయిన్‌ ఎవరు అనేగా డౌట్‌. ఈ సినిమాలో కథానాయికగా సమంత పేరు ప్రచారంలో ఉంది. అయితే ఆమె ఓకే చెబుతుందా అనేదే డౌట్‌. ఎందుకంటే ఇటీవల కాలంలో రవితేజ సరసన అగ్ర హీరోయిన్లు నటించడం లేదు. కాబట్టి కొత్త హీరోయిన్‌నే తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus