సినిమాలు వద్దు.. చదువే ముద్దు

కనుబొమ్మల సయ్యాటలో యువతను మొత్తం తన మాయలో పడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి చర్చించినంతగా గత దశాబ్దకాలంలో ఏ కొత్త హీరొయిన్ గురించి జరగలేదని ఘంటాపధంగా చెప్పొచ్చు. అంత దాకా ఎందుకు విశ్వసుందరి కిరీటం తెచ్చిన మానుషి చిల్లార్ గురించి యూత్ లో అధిక భాగం పూర్తిగా తెలియనేలేదు. అలాంటిది ఒక్క చిన్న టీజర్ తో మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ను సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. ఒరు ఆదార్ లవ్ అనే మలయాళం సినిమాలో ప్రియా వారియర్ హీరొయిన్ కాదు. తనది సపోర్టింగ్ రోల్. కాని తన లుక్స్ – యాక్టింగ్ లో మేజిక్ గమనించిన దర్శకుడు ఒమర్ లుల్లు తను కూడా హై లైట్ అయ్యేలా టీజర్ కట్ చేయించాడు. అది కాస్త సెన్సేషన్ గా మారి ఇటీవలే విడుదలైన మరో టీజర్ కూడా అంతే స్థాయిలో స్పందన దక్కించుకుంటోంది.

ఇమేజ్ వచ్చిన చోట ఆఫర్లు రావడం అంటే బెల్లం చుట్టూ చీమలు ముసిరినంత సహజం. ప్రియా ప్రకాష్ కు కూడా ఇది అనుభవమవుతోంది. ఒరు ఆదార్ లవ్ విడుదల కాకుండానే అవకాశాలు ముంచెత్తుతున్నాయి. బాలీవుడ్ వృద్ధ హీరో రిషి కపూర్ అంతటి వాడే పిల్లా నువ్వు మా తరంలో ఎందుకు పుట్టలేదు అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు అంటేనే తన రేంజ్ అర్థమవుతుంది. కాని ప్రియా వారియర్ తొందరపడటం లేదు. ఈ రెస్పాన్స్ పుణ్యమా అని ఒరు ఆదార్ లవ్ లో తన పాత్ర పరిధి పెరిగిందని. కాని ఇప్పటికిప్పుడు తాను ఏ సినిమాను ఒప్పుకోనని క్లారిటీ గా చెప్పేస్తోంది. ఆగష్టులో ఈ మొదటి సినిమా రిలీజ్ అయ్యాకే నిర్ణయం తీసుకుంటాను అని చెబుతోంది.
డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం చదువు నిమిత్తం హాస్టల్ లో ఉంది. ఊహించనంత పాపులారిటీ రావడం వల్ల ఇంటికి మీడియా ప్రతినిధుల తాకిడి అధికం కావడంతో అది భరించలేక తల్లి ఇంటి నుంచి హాస్టల్ కు షిఫ్ట్ చేసింది. ఒరు ఆదార్ లవ్ ఘన విజయం సాధించాక అప్పుడు మార్కెట్ ను బట్టి కొత్త సినిమాలు పారితోషికం గురించి డిసైడ్ చేయాలనీ ప్రియా వారియర్ ప్లానట. తెలివైన పిల్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus