తన ప్రియురాలిని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రియదర్శి
- February 14, 2018 / 09:46 AM ISTByFilmy Focus
‘నా చావు నేను చస్తా నీకెందుకు’ అనే ఒకే ఒక డైలాగ్ తో నవ్వులు కురిపించిన ప్రియదర్శి.. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. దీంతో అనేక అవకాశాలు అందుకున్న ప్రియదర్శి.. రీసెంట్ గా రిలీజ్ అయిన తొలి ప్రేమ సినిమాలో తనదైన నటనతో ఎంటర్టైన్ చేశారు. ఇలా రీల్ లైఫ్ లో ప్రేమకథలో ఒక భాగం మాత్రమే కాకుండా.. రియల్ లైఫ్ లో తనకంటూ ఓ లవ్ స్టోరీ ఉందని బయటికి చెప్పారు. తన మనసు గెలుచుకున్న అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. తాను రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ప్రేమికుల రోజు సందర్భంగా వెల్లడించారు.
నిన్న ఆ అమ్మాయి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక ప్రేమలేఖ రాశారు. ఈ లేఖతో పాటు జంట కూడా అందరి అభినందనలు అందుకుంది. ఎటువంటి రూమర్స్ రాకముందే ప్రియదర్శి ప్రేమను బయటికి చెప్పి మంచి పని చేసారని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే రీతిలో సోషల్ మీడియాలో కొత్త గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ప్రియదర్శి, రిచా శర్మలు ఈనెల 23న హైదరాబాద్ లో పెళ్లి చేసుబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలో తెలియనుంది.













