Priyamani: వాష్ రూమ్స్ లేకపోవడంతో అలా చేశా.. ప్రియమణి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ప్రియమణి (Priyamani) ఒకరు కాగా ఇప్పటికీ ప్రియమణి వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు వెబ్ సిరీస్ లతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రియమణి నటనకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న ప్రియమణి పరుత్తివీరన్ సినిమా షూట్ సమయంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు.

2006 సంవత్సరంలో పరుత్తివీరన్ షూటింగ్ జరిగే సమయంలో క్యారవాన్ తరహా సౌకర్యాలు లేవని ఆమె అన్నారు. మధురైలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని ప్రియమణి పేర్కొన్నారు. కొన్ని పల్లెటూళ్లలో ఈ సినిమా షూట్ జరిగిందని ప్రియమణి తెలిపారు. ఆ సమయంలో రెస్ట్ రూమ్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో నేను చాలా ఇబ్బందులు పడ్డానని ప్రియమణి కామెంట్లు చేయడం గమనార్హం.

అక్కడ నివాసం ఉండే వాళ్ల రెస్ట్ రూమ్స్ ను వినియోగించాల్సి వచ్చేదని లేకపోతే ఓపెన్ గా వెళ్లాల్సి వచ్చేదని ఆమె కామెంట్లు చేశారు. పరుత్తివీరన్ కార్తీ (Karthi) హీరోగా నటించిన తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియమణి నటనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ప్రియమణి పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

ప్రియమణి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రియమణికి సోషల్ మీడియాలో సైతం ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రియమణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. ప్రియమణి కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus