అభిషేక్ బచ్చన్ ను రిజెక్ట్ చేసిన ప్రియాంక!

హీరోయిన్లకు ఆఫర్లు దొరకడమే గగనమైపోతున్న తరుణంలో ఒక హీరోయిన్ తనకు వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేయడం అనేది చాలా రేర్ కేసెస్ లోనే జరుగుతుంది. అలాంటి రేర్ కేస్ ఇటీవల బాలీవుడ్ లో చోటు చేసుకొంది. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొంటూ అక్కడ తన ఉనికిని పదిల పరుచుకొంటున్న ప్రియాంకచోప్రాకు కొంత గ్యాప్ తో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. తన ఫేవరెట్ డైరెక్టర్ కావడం, కథ కూడా ఆల్మోస్ట్ బయోపిక్ లాంటిది కావడంతో వెంటనే ఒకే చెప్పేసింది ప్రియాంక.

కట్ చేస్తే.. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేద్దామని చిత్రబృందం సన్నద్ధమవుతున్న సమయంలో “నేనీ సినిమా నుంచి తప్పుకొంటున్నాను” అంటూ డైరెక్టర్ కి ఓ వాట్సాప్ మెసేజ్ పంపిందట. ప్రియాంక సడన్ డెసిషన్ కి రీజన్ ఎంటా అని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్న టీం మెంబర్స్ కి “అభిషేక్ బచ్చన్ ను హీరోగా సెలక్ట్ చేయడమే కారణం, అతను హీరోగా యాక్ట్ చేస్తే నేను నటించబోయేది లేదు” అంటూ మరో మెసేజ్ పంపిందట. “బ్లఫ్ మాస్టర్”లో ఐశ్వర్యరాయ్ ను అప్పట్లో ప్రియాంక రీప్లేస్ చేయడం పట్ల అభిషేక్ చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రియాంక ఇప్పుడు ఇలా రివెంజ్ తీసుకొందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరోని, అది కూడా భారీ సినీ నేపధ్యం ఉన్న బచ్చన్ కుటుంబ కథానాయకుడ్ని రిజెక్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus