బ్లాక్ కలర్ బికినీతో మైండ్ బ్లాక్ చేసిన ప్రియాంక..!

  • March 28, 2019 / 05:17 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల అమెరికన్ సింగర్ .. నటుడు అయిన నిక్ జోనాస్ ని పెళ్ళాడి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భర్తతోనూ అలాగే తన అత్త మామలతోనూ కలిసి ఫ్యామిలీ సభ్యులతో హ్యాపీగా హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక చోప్రా. మియామిలోని దీవులకు తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇక తన భర్త నిక్ జోనాస్ తో ప్రియాంక రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

బ్లాక్ కలర్ బికినీ ధరించి ఇప్పటికీ వన్నె తగ్గని అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుని హీటెక్కిస్తోంది. 36 ఏళ్ళ వయసులో కూడా తన అందం ఏమాత్రం తగ్గలేదంటూ సోషల్ మెడిలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఓ రేంజ్లో అందాలు ఆరబోసి అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లైన ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ లేక్ గట్టి పోటీ ఇచ్చేది. కుర్ర హీరోయిన్లు ఎంతమంది వచ్చినా ఈమె బికినీ దాటికి అందరూ సైడ్ ఇచ్చేసేవారు. అయితే పెళ్ళై పోయింది కదా.. ఇక ఇలా బికినీలో ఇంకెప్పుడూ ప్రియాంక చోప్రా కనిపించదేమో అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆమె ఇలా బికినీతో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ముందు కూడా ప్రియాంక ఇలానే అందాలు ఆరబోస్తుందని ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus