వివేక్‌ కోసం హీరోయిన్‌ను రిపీట్‌ చేస్తున్న నాని… ఎవరంటే?

  • October 2, 2023 / 05:26 PM IST

‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా చూశాక… నాని – ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కాంబినేషన్‌ బాగుంది అని మీరు అనుకున్నారా? కుదిరితే మరోసారి ఆ ఇద్దరూ కలసి నటించాలి అని మనసులో కోరుకున్నారా? అయితే మీ కోరిక నెరవేరుతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నాని – ప్రియాంక కాంబోలో ఓ సినిమాకు ప్లాన్స్‌ జరుగుతున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నారని టాక్‌. త్వరలో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారట.

ఇప్పుడు ఆ సినిమాలోనే ప్రియాంకను తీసుకుంటారు అని చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయిపోయాయి అని చెబుతున్నారు. ‘గ్యాంగ్ లీడర్‌’ సినిమా టైమ్‌కి ప్రియాంక కొత్త నాయిక… అయితే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ సినిమా నాయిక. పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమాలో ప్రియాంకనే కథానాయిక అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా ఆమె మరే తెలుగు సినిమా చేయడం లేదు. నాని సినిమా చేస్తే ఇదే అవుతుంది.

నాని, వివేక్‌ ఆత్రేయ గతంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు సరైన వసూళ్లు రాలేదు కానీ… నానికి అయితే డిఫరెంట్‌ మూవీ అనే పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరి ఈ రెండో సినిమాతో ఏం చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమా ‘ఓజీ’ సినిమా తీస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకం మీదే తెరకెక్కుతోంది. ఆ సినిమాలో నటన చూసే నిర్మాణ సంస్థ ఈ సినిమా కూడా తీసుకుంది అంటున్నారు.

ఇక ప్రియాంక తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ధనుష్‌ హీరోగా రూపొందుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో ఆమెనే నాయిక. ఈ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించబోయే సినిమాలో కూడా కథానాయికగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఎంపిక అయ్యిందని అంటున్నారు. ఇవి కాకుండా కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే అనౌన్స్‌ చేస్తారని టాక్‌.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus