Priyanka Eliminated: ప్రియాంక సింగ్ 13 వారాలు గేమ్ లో ఎలా ఉంది..?

బిగ్ బాస్ హౌస్ నుంచీ 13వ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం తన గేమ్ తోనే అందర్నీ ఆకర్షించిన ప్రియాంక సింగ్ జెర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది. ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటరై తనదైన స్టైల్లో గేమ్ ఆడింది ప్రియాంక. పింకీగా ఆటతోనే కాకుండా, అందంతో సైతం ప్రేక్షకులని ఆకర్షించింది. నిజానికి మనం చూసినట్లయితే, బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ముందుగానే సోషల్ మీడియాలో తెలుస్తున్నా కూడా ఎలిమినేషన్ అయ్యేవరకూ టెన్షన్ గానే ఉంటోంది. ఎందుకంటే, రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక నాలుగు సీజన్స్ లో బిగ్ బాస్ తిరుగులేకుండా నడిచింది.

ఇప్పుడు ఐదో సీజన్ కూడా దాదాపుగా పూర్తికావస్తోంది. ఇక ఎవరు ఎలిమినేట్ అయినా కూడా వాళ్లు విజేతలుగానే లెక్క. ఎందుకంటే, చాలావారాలు హౌస్ లో సేఫ్ అవుతూ 19మంది కంటెస్టెంట్స్ ని దాటుకుంటూ వాళ్ల గేమ్ ని ప్రూవ్ చేస్కున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. అందులో ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ప్రియాంక , కాజల్ ఇద్దరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని గతవారం రోజులుగా టాక్ వినిపిస్తోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో ఓటింగ్ ముగిసిన తర్వాత అన్ని చోట్లా ప్రియాంకసింగ్ లీస్ట్ లోనే ఉంది. దీంతో పింకీ ఎలిమినేట్ అవుతుందని ముందుగానే చెప్పేశారు చాలామంది. ఇక పింకీ గేమ్ విషయానికి వస్తే, ఫస్ట్ నుంచీ తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేసింది.

ఆతర్వాత మానస్ తో ఎక్కువగా ఉండటం, మానస్ తో ట్రాక్ నడిపించడంలో బిగ్ బాస్ షోకి కావాల్సిన మసాలా దొరికింది. నిజానికి ఐదో వారం, ఆరోవారం ప్రియాంక సింగ్ వెళ్లిపోతుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా సేఫ్ అవుతూ వచ్చింది. లాస్ట్ వీక్ కూడా సేఫ్ జోన్ లోనే ఉండటం, రవి ఎలిమినేట్ అయిపోవడం అనేది పింకీని బచాయించింది. ఇక ఈవారం పింకీ ఎలిమినేట్ అవ్వడం అనేది తప్పలేదు. పింకీ గేమ్ మొదటి నుంచీ చూసినట్లయితే, రాగానే టాస్క్ లు చాలాబాగా ఆడింది. ఆ తర్వాత శ్రీరామ్ అండ్ మానస్ ఇద్దరితోనూ ఫ్రెండ్షిప్ అనేది పెంచుకుంది. అయితే, హమీదా శ్రీరామ్ కి దగ్గరయినపుడు పింకీ మానస్ తో క్లోజ్ అయ్యింది. చాలాకాలం మానస్, కాజల్, సన్నీ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు వారితోనే ఉంది.

అయితే, ఈవారం నామినేషన్స్ లో ప్రియాంక కాజల్ ని నామినేట్ చేయడాన్ని మానస్ తప్పుబడ్డాడు. తను నీకోసమే స్టాండ్ తీస్కుంది కదా, నీవాళ్లు ఎవరో, ఫ్రెండ్స్ ఎవరో గుర్తించు అంటూ దూరం పెట్టాడు. దీంతో వీళ్లిద్దరికీ చిన్నపాటి ఘర్షణ అయ్యింది. గేమ్ పరంగా టాస్క్ ల పరంగా చూస్తే ప్రియాంక తన తోటివారితో పోటీ పడలేకపోయింది. విలన్స్ హీరోలు టాస్క్ లో , కొన్ని టాస్క్ లలో తప్ప, ఎక్కడా కూడా తన ప్రతిభని చూపించలేకపోయింది. అయినా కూడా 13 వారాల పాటు తన గేమ్ ని ఆడుతూ హౌస్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంది. టాప్ 5కి దగ్గరగా వచ్చింది. అందుకే, ఇప్పుడు ప్రియాంక ఎలిమినేట్ అయినా కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుందనే చెప్పాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus