Bigg Boss Telugu 5: ఈవారం ఎలిమినేషన్ ఎవరు..? ఆమెకి ముందే తెలిసిందా..?

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ దగ్గర పడుతుంటే హౌస్ మేట్స్ లో టెన్షన్ మొదలవుతోంది. 19మంది లో నుంచీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లో నుంచీ వరుసగా ఎలిమినేట్ అయిపోవడం అనేది హౌస్ మేట్స్ ని మరింత ఖంగారు పెడుతోంది. ఎందుకంటే, ఇంతవరకూ వచ్చి ఇప్పుడు టాప్ 5లో లేకుండా ఎలిమినేట్ అయిపోతున్నామా అనే బాధ వెంటాడుతోంది. ఇక్కడే ప్రియాంక ఈవారం నేను కానీ, కాజల్ అక్క కానీ వెళ్లిపోతాం అన్నట్లుగా షణ్ముక్ తో చెప్పుకుని బాధపడింది. అయితే, షణ్ముక్ మాత్రం మానస్ వెళ్లిపోతాడేమో అని ప్రిడిక్ట్ చేశాడు.

కానీ, పింకీ మాత్రం తనకి డేంజర్ ఉందని ముందుగానే గుర్తించినట్లుగా చెప్పింది. అయితే, ఈవారం నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు ఉన్నారు. మానస్, శ్రీరామ్ చంద్ర, కాజల్, సిరి, ఇంకా పింకీ ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఎవరైనా వెళ్లిపోవచ్చు అనే ప్రిడిక్షన్ లో ఉంది ప్రియాంక. అయితే, షణ్ముక్ తో చెప్పేటపుడు మాత్రం సిరి పేరు చెప్పలేదు. సిరికి షణ్ముక్ ఫ్యాన్స్ ఓటు వేస్తున్నారన్న విషయం ప్రియాంకకి బాగా తెలిసింది. అందుకే, ఈవారం షణ్ముక్ రేసులో లేడు. ఇక కాజల్ కి సన్నీ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారని, మానస్ కి , శ్రీరామ్ చంద్రకి ఫిక్స్ డ్ ఓటింగ్ జరుగుతూ ఇన్నాళ్లుగా సేఫ్ అవుతూ వస్తున్నారని పింకీ బాగా గుర్తించింది.

అందుకే తను కానీ, కాజల్ కానీ వెళ్లిపోవచ్చని ప్రిడిక్షన్ చెప్పింది. అయితే, స్ట్రాంగ్ గా మాత్రం తను వెళ్లిపోతానని టెన్షన్ మొదలైంది. ఇక షణ్ముక్ ఇదే విషయాన్ని కాజల్ తో పోట్లాడేటపుడు కూడా చెప్పాడు. కాజల్ సింపతీ కోసం ఇప్పుడు బయటకి వెళ్లి మానస్ కి , సన్నీకి చెప్తుందని అన్నాడు. అంతేకాదు, అంతకుముందు పింకీతో మాట్లాడేటపుడు కూడా సన్నీ ఫ్యాన్స్ కాజల్ ని కాపాడుతున్నారు అని, అందుకే నేను సన్నీతో కాజల్ చేసింది తప్పా కాదా అనే విషయాన్ని క్లియర్ గా చెప్పించానని అన్నాడు.

ఇలా కూడా గేమ్ ఆడతారా అన్నయ్యా అంటూ అప్పుడు పింకీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు మాత్రం వాస్తవాన్ని ముందుగానే గ్రహించిందా , ముందే తన ఎలిమినేషన్ తెలిసిపోయిందా అని అంటున్నారు అందరూ. ఇక అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా చూస్తే అన్నింటిలోనూ పింకీనే లీస్ట్ లో ఉంది. కాబట్టి, సోషల్ మీడియా సాక్షిగా ఈవారం పింకీ ఎలిమినేట్ అవ్వక తప్పదనే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus