Bigg Boss 7 Telugu: కెప్టెన్ అవ్వాలని ఉన్మాది అయిపోయిన అమర్..! ప్రియాంకతో గొడవకి కారణం అదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో అమర్ పిచ్చిపట్టినట్లుగా అరుస్తూ రెచ్చిపోయాడు. ఒకవైపు నుంచీ తన టవర్ ని కూల్చేయాలని చూస్తున్న గౌతమ్ పై అరుస్తూ, బ్రతిమిలాడుతూ, ఏడుస్తూ ఇలా మ్యాడ్ ఎమోషన్స్ ని చూపించాడు.అలాగే, మరోవైపు నుంచీ రతికని సైతం అర్ధిస్తూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఒక పక్క నుంచీ సంచాలక్ డిపెండ్ చేస్కో అడుక్కోకు అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రెచ్చిపోయాడు. అసలు ఇంతలా అమర్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు ? చేసిందంటా డ్రామాయేనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, తను ఫ్రస్టేట్ అయిపోయి ఎవరూ సపోర్ట్ చేయట్లేదని ఏడ్చాడని అంటున్నారు చాలామంది.

అమర్ ఫ్యాన్స్ అయితే, ట్రోల్స్ చేసినవాళ్లని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కెప్టెన్సీ టాస్క్ లో సోషల్ మీడియాలో అమర్ ఇలా ప్రవర్తించిన వీడియో వైరల్ అయి హైలెట్ అవుతోంది. అయితే, ఇలా అవ్వడానికి కారణం ప్రియాంకేనా ? లేదా కావాలనే అమర్ ఇలా చేశాడా అనేది అర్దంకాని పరిస్థితిగా మారింది. అసలు మేటర్లోకి వెళితే.. బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ అందరూ పోటీ పడాలని టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో హర్డల్స్ దాటుకుంటూ ఇటుకలు కలక్ట్ చేయాలి. అలా ప్రతి రౌండ్ లో ఒక్కొక్కరు తొలగిపోతూ చివరికి నలుగురు మిగిలారు. ప్రశాంత్, అర్జున్, అమర్ ఇంకా ప్రియాంకలు ఉన్నారు. ఈ నలుగురు ఆ ఇటుకలతో టవర్స్ ని నిర్మించారు.

బజర్ మోగినప్పుడల్లా మిగతా హౌస్ మేట్స్ బాల్స్ తో ఎవరు కెప్టెన్ అవ్వకూడదో వారి టవర్ ని కూల్చాల్సి ఉంటుంది. దీంతో ఆట మొదలైంది. ఫస్ట్ పల్లవి ప్రశాంత్, తర్వాత అర్జున్ రేస్ నుంచీ అవుట్ అయ్యారు. అమర్ ఇంకా ప్రియాంక ఇద్దరు మాత్రమే మిగిలారు. 11 వారాల జెర్నీలో ఇద్దరూ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. దీంతో అమర్ అందరినీ బ్రతిమిలాడుకోవడం మొదలు పెట్టాడు. శోభాశెట్టి మాత్రం అమర్ కి గట్టిగా హెల్ప్ చేస్తూ ప్రియాంక బ్రిక్స్ ని పడగొట్టాలని చూసింది. ఎందుకంటే, 9వ వారంలో శోభాశెట్టి కెప్టెన్ అవ్వడంలో అమర్ కీలకపాత్ర పోషించాడు. శోభా బదులు బస్తాని మోస్తూ రింగ్ లో టాస్క్ ఆడి గెలిచాడు. శోభాశెట్టిని కెప్టెన్ ని చేశాడు. దీంతో శోభాశెట్టి కూడా ఈసారి అమర్ ని కెప్టెన్ చేయాలని అనుకుంది.

అందుకే, తన ప్రెండ్ అయినా కూడా ప్రియాంక టవర్ ని కూల్చాలని చూసింది. మరోవైపు గౌతమ్ కూడా తన చెల్లి ప్రియాంకకే సపోర్ట్ చేస్తున్నా అంటూ అమర్ టవర్ పై బాల్స్ విసిరాడు. రతిక కూడా అమర్ ని టార్గెట్ చేసింది. దీంతో ఆట ఆసక్తిగా మారింది. వీళ్ల బాల్స్ ని అడ్డుకుంటూనే వారిని బ్రతిమిలాడుకూంటూ ఓవర్ గా ఫ్రస్టేట్ అయిపోయాడు అమర్. పిచ్చి పట్టినవాడిలా అరుస్తూ ఉన్మాదిగా మారిపోయాడు. అయినా కూడా వాళ్లని ఆపలేకపోయాడు. దీంతో ప్రియాంక ఈవారం ఇంటి కెప్టెన్ అయ్యింది. ఈ టాస్క్ లో అమర్ ప్రవర్తన చూసి హౌస్ మేట్స్ అందరికీ భయం వేసింది. అంతేకాదు, చూస్తున్న ప్రేక్షకులు సైతం అమర్ కూల్ అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus