‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది ఈ మూవీ. ఇప్పటికే రూ.280 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఈ సినిమాకి ఎక్కువగానే కనిపిస్తుంది.
బాహుబలి 2 (Baahubali2) తర్వాత ప్రభాస్ (Prabhas) చేసిన సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. మరోపక్క ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని టీం ముందుగా ప్రకటించలేదు. కానీ సినిమా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. కచ్చితంగా సెకండ్ పార్ట్ ఉండాలి అనేట్టుగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంది.
అయితే సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వంటి సందేహాలు అందరిలో ఏర్పడ్డాయి. తాజాగా ఈ విషయంపై ‘కల్కి..’ నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) స్పందించారు. ‘కల్కి 2898 ad’ సినిమా విషయంలో మేము ముందుగా అనుకున్నప్పుడు పార్ట్ 2 ఆలోచన లేదు. కమల్ హాసన్ కి (Kamal Haasan) కథ నేరేట్ చేస్తున్నప్పుడు కూడా నాగ్ అశ్విన్ కి (Nag Ashwin) ఆ ఆలోచన లేదు.
తర్వాత ఇది 2 పార్టులుగా చెబితే బాగుంటుంది అని అతనికి అనిపించింది. పార్ట్ 2 సంబంధించి ఆల్రెడీ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ మేజర్ పార్ట్ షూట్ చేయాలి. కాబట్టి.. ఎప్పుడు రిలీజ్ అనేది అప్పుడే చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చారు.