Bandla Ganesh: రీ- రిలీజ్ చేసి అది హిట్ సినిమా అని ప్రూవ్ చేస్తాడట..!

పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  , బండ్ల గణేష్(Bandla Ganesh) కాంబినేషన్ అనగానే అందరికీ ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)   మాత్రమే గుర్తొస్తుంది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి.. దాని గురించే ఎక్కువగా అందరూ చెప్పుకుంటారు. కానీ వీరి కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా ‘తీన్ మార్’ (Teen Maar) . బండ్ల గణేష్ చెప్పుకుంటే తప్ప ఈ విషయం గురించి ఎక్కువ మందికి తెలీదు. ‘ఆంజనేయులు’ (Anjaneyulu) అనే ఒక్క సినిమా చేసిన నిర్మాతకి వెంటనే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఎలా ఇచ్చేశాడు? అనేది అప్పట్లో చాలా మందికి అర్థం కాలేదు.

Bandla Ganesh

మరోపక్క ఆ సినిమా ప్లాప్ అయితే వెంటనే ‘గబ్బర్ సింగ్’ చేసుకోమని ఆఫర్ ఇవ్వడం అనేది కూడా ఇప్పటికీ పెద్ద మిస్టరీనే..! ఏదేమైనా ‘గబ్బర్ సింగ్’ అనేది బ్లాక్ బస్టర్ సినిమా.. బండ్ల గణేష్ కి బాగా డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా. కానీ అతనికి ‘తీన్ మార్’ పైనే ప్రేమ ఎక్కువగా ఉంది. ఇది చాలా విషయంలో ప్రూవ్ అయ్యింది.

‘తీన్ మార్’ అనే సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన ‘లవ్ ఆజ్ కల్’ కి రీమేక్. తెలుగులో మాత్రం అది ఫ్లాప్ అయ్యింది. జయంత్ సి పరాన్జీ (Jayanth C. Paranjee) సినిమాని బాగా తెరకెక్కించినప్పటికీ, క్లైమాక్స్ బాగా వచ్చినప్పటికీ.. ఎందుకో సినిమా ఆడలేదు. త్రివిక్రమ్ (Trivikram)  ఆ సినిమాకి సంభాషణలు అందించారు. ఓ సందర్భంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘ ‘తీన్ మార్’ సినిమా త్రివిక్రమ్ కనుక డైరెక్ట్ చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యుండేది’ అన్నాడు.

ఇక ఈరోజు జరిగిన ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ప్రెస్ మీట్లో .. “నా మనసుకు నచ్చిన సినిమా ‘తీన్ మార్’. దానిని రీ రిలీజ్ చేసి అందరితోనే అది హిట్ సినిమా అని చెప్పించాలని ప్రయత్నిస్తున్నాను” అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే ‘తీన్ మార్ ‘ పై బండ్ల గణేష్ కి ప్రేమ ఎక్కువగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది.మరి అతను కోరుకున్నట్టు ‘తీన్ మార్’ రీ రిలీజ్ లో సక్సెస్ అవుతుందేమో చూడాలి

నన్ను క్షమించు నాన్నా.. హీరోయిన్ అనిత కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus