Bunny Vasu: ‘పుష్ప 2’ షూటింగ్ ఆగిపోవడం పై బన్నీ వాస్ స్పందన.!

‘అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ..ల మధ్య గొడవ జరిగింది. అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ కి కోపం వచ్చి క్యారెక్టర్ కోసం పెంచిన గడ్డంని ట్రిమ్ చేసుకుని.. ఆయన కూడా ఫ్యామిలీతో విదేశాలకి వెళ్ళిపోయాడు’.. ఇవి కొన్ని రోజులుగా మీడియాలో నలుగుతున్న వార్తలు. వీటిపై ఫార్మల్ గా క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి బన్నీ వాస్ (Bunny Vasu) . ‘ఆయ్’ (AAY) సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన స్పందించాడు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఆ వార్తలు చూసి నవ్వుకున్నాం.మాకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది. ‘లెట్ ఇట్ గో’ అనుకున్నాం. కానీ వాస్తవానికి అయితే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) షూటింగ్ కోసం అల్లు అర్జున్ ఇంకో 15 రోజులు డేట్స్ ఇవ్వాలి అంతే.! అందులో ఓ పాట షూటింగ్ కూడా చేయాలి. మరోపక్క ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) షూటింగ్ పార్ట్ 35 రోజుల వరకు పెండింగ్ ఉంది. ఏప్రిల్ ఆ టైంలో ఆయన షెడ్యూల్ అనుకుంటే.. కుదర్లేదు. కాబట్టి.. మధ్యలో ఇంత టైం ఉంది కదా..

పైగా ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్నాడు అని భావించి.. మళ్ళీ 35 రోజులు, ఆ టైంకి గడ్డం పెరిగేలా లెక్కేసుకుని కొంత ట్రిమ్ చేసుకుని వెళ్లారు అల్లు అర్జున్. ఆయన పెండింగ్ పార్ట్ షూటింగ్ మొత్తం చివర్లో చేద్దాం అనే ఉద్దేశంతో అంతే..! దానిని పట్టుకుని మీడియాలో ఏదేదో ప్రచారం చేశారు. అవన్నీ వినడానికి, చదువుకోవడానికి బాగుంటాయి. కానీ సుకుమార్, అల్లు అర్జున్..ల మధ్య ఉన్న బాండింగ్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు.

నాకు కూడా సుకుమార్ గారు చాలా క్లోజ్. ‘పుష్ప’ (Pushpa) అనేది ఎంత పెద్ద హిట్ అయ్యింది… సీక్వెల్ ఎంత బాగా తీయాలి అనే ఆలోచన వాళ్ళ మైండ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇంత టైం తీసుకోరు కదా. కాబట్టి అలాంటి న్యూస్..లు స్ప్రెడ్ చేసే వాళ్ళు ఇది కూడా గమనించాలి” అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus