Razakar: ‘రజాకార్’ డైరెక్టర్ పై నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి కామెంట్స్ వైరల్!

  • March 12, 2024 / 01:36 PM IST

బాబీ సింహా (Bobby Simha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రజాకార్’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. (Vedika) వేదిక, అనుష్య త్రిపాఠి, (Prema) ప్రేమ‌, (Indraja) ఇంద్ర‌జ‌, (Makarand Deshpande)  మ‌క‌రంద్ దేశ్ పాండే వంటి వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 15 న విడుదల కానుంది. ‘స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై గూడూరు నారాయ‌ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌కుడు. మార్చి 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలుసు. 1950 టైంలో రజాకార్ ..లు హైదరాబాద్ ప్రజలను ఎలా పీడించారు అనే పాయింట్ తో ఈ సినిమా రూపొందింది. దీంతో సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయేమో అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం దర్శకుడు యాటా సత్యనారాయణ ఏకంగా రూ.50 కోట్లు బడ్జెట్ పెట్టించాడట. ఈ విషయాన్ని నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి తెలియజేశారు.

‘రజాకార్’ సినిమాకి దర్శకుడు యాటా సత్యనారాయణ పర్ఫెక్ట్. ‘బాహుబలి’ రేంజ్లో దీనిని తీర్చిదిద్దాడు. ముందుగా రూ.16 కోట్లు బడ్జెట్ అన్నాడు. తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ రూ.50 కోట్లు అయ్యింది. సినిమాలో అంతా పెద్ద క్యాస్టింగ్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా సినిమాకి పనిచేసాడు. పెద్ద పెద్ద సింగర్స్ తో పాటలు పాడించాడు. టెక్నికల్ గా చాలా రిచ్ గా తీశాం’ అంటూ నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus