Naga Vamsi: ఆ విషయంలో నేను వీక్.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014 లో వచ్చిన ‘లవర్స్’ (Lovers) అనే సినిమాతో నిర్మాతగా మారిన ఇతను.. ఆ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థను స్థాపించి.. ఈ బ్యానర్లో వరుసగా చిన్న, మిడ్ రేంజ్, పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్నారు, ‘బాబు బంగారం’ (Babu Bangaram) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘సార్’ (Sir) వంటి పెద్ద సినిమాలు ఈ బ్యానర్ నుండి వచ్చాయి. అలాగే ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) ‘డీజె టిల్లు’ (Dj Tillu) ‘మ్యాడ్’ (MAD) వంటి చిన్న సినిమాలు పెద్ద సక్సెస్..లు అందుకున్నాయి.

Naga Vamsi

ప్రస్తుతం బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబీ కొల్లి (Bobby)  కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రవితేజ 75 (RT 75) వ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు నాగవంశీ. అలాగే అక్టోబర్ 31న ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో ఆయన బాబాయ్ అంటే ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత అయినటువంటి ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) గారికి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

‘మీరు నిర్మించిన సినిమాల్లో మీ బాబాయ్ గారికి బాగా నచ్చిన సినిమా ఏంటి?’ అని నాగవంశీని ప్రశ్నించగా.. ‘నేను తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆయనను సంతృప్తి పరచలేదు. ఎందుకంటే చెప్పిన బడ్జెట్లో తీయను, అనుకున్న టైంకి రిలీజ్ చేయను అని నన్ను ప్రతి సినిమాకి తిడుతూనే ఉంటారు. బడ్జెట్ కంట్రోల్ చేయడంలో నేను బాగా వీక్.దానికి సొల్యూషన్ కూడా నాకు తెలియడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

చిన్న గ్యాప్‌లో లోకేశ్‌.. తన ప్రపంచం గురించి చిన్న సినిమా రెడీ చేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus