Naga Vamsi: 250 రూ.ల టిక్కెట్ రేటులో నిర్మాతకు వచ్చేది ఎంతో తెలుసా

సినిమా విడుదల సమయంలో కలెక్షన్లు గురించి వచ్చిన ప్రతి వార్త ప్రేక్షకులను ఆసక్తిగా ఆకట్టుకుంటుంది. హీరోలు, నిర్మాతలు, ట్రేడ్ అనలిస్ట్‌లు ఇలా ప్రతీ ఒక్కరు కలెక్షన్లను హైలైట్ చేస్తూ సినిమా రేంజ్‌ను నిర్ధారిస్తుంటారు. కానీ ఆ కలెక్షన్ల వెనుక అసలు లెక్కలు ఎలా ఉంటాయో చాలా మందికి అవగాహన ఉండదు. తాజాగా నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ విషయం గురించి ఆసక్తికరమైన వివరాలు తెలిపారు. ఒక సినిమా టికెట్ రేటు 250 రూపాయలు ఉంటే, దాంట్లో మొత్తం నిర్మాతకు వచ్చే టోటల్ ను శాతం వారీగా ఆయన వివరించారు.

Naga Vamsi

250 రూపాయల టికెట్ రేటులో మొదటగా 18% GST ప్రభుత్వానికి పోతుంది. మిగిలిన 205 రూపాయలను నెట్ కలెక్షన్ అంటారు. ఈ నెట్ కలెక్షన్‌లోనూ థియేటర్లకు, ఎగ్జిబిటర్లకు శాతం కట్ చేస్తారు. ఈ కట్స్ తర్వాత తుది మొత్తమే నిర్మాతకు షేర్‌గా అందుతుంది. మొత్తం టికెట్ రేటు 250లో నిర్మాతకు సగటున 100 రూపాయల వరకు మాత్రమే వస్తుంది.

మిగిలిన మొత్తాన్ని థియేటర్ యాజమాన్యం, ఎగ్జిబిటర్లు తమ వాటాగా తీసుకుంటారు. మొదటి వారంలో ఎగ్జిబిటర్ల శాతం ఎక్కువగా ఉంటే, రెండవ వారానికి తగ్గుముఖం పడుతుంది. ఈ లెక్కల ప్రకారం నిర్మాతలు తమ లాభాలను చూసుకోవడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఇక బడ్జెట్ ఎక్కువైన సినిమాల విషయంలో నిర్మాతల లాభాలు ఇంకా తగ్గిపోతాయి.

తక్కువ నిడివి, తగిన ప్రమోషన్‌తో సినిమాలను ప్లాన్ చేస్తే ఖర్చు తగ్గించవచ్చని మరికొందరు నిర్మాతలు సూచించారు. అయితే, హీరోల రెమ్యునరేషన్ పెరుగుతుండడం కూడా నిర్మాణ వ్యయాలపై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కలతో ఫ్యాన్స్, ప్రేక్షకులూ మరోసారి ఆలోచనలో పడుతున్నారు. భారీ కలెక్షన్లను చూస్తూ నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది.

పుష్ప 2 కలెక్షన్స్.. ఇప్పటివరకు సంధ్య థియేటర్స్ లో వచ్చిందేంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus