తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో కంటెంట్ ప్రధానమై చిత్రాలు రూపొందుతున్నాయి. అలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొంది ఈ శుక్రవారం విడుదలైన చిత్రం `ఆటగదరా శివ`. `పవర్`, `లింగా`, `బజరంగీ భాయీజాన్` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాణంలో `ఆ నలుగురు`, `మధు మాసం`, `అందరి బంధువయ`తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విడుదలకు ముందే సినిమా కొన్ని అంచనాలతో విడుదలైన `ఆటగదరా శివ` తొలి ఆట నుండే పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా….
దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ – “తాత్విక సిద్ధాంతాన్ని అంతర్లీనంగా.. ఓ కథాంశంతో సినిమాగా రూపొందించడం ఆనందంగా ఉంది. డిపరెంట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఉదయ్‌శంకర్, దొడ్డన్న నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బావుంటుంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్“ అన్నారు.
రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ “ఆటగదరా శివ` వంటి విలక్షణమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే నా సంకల్పం నేరవేరింది. రెగ్యులర్‌కి భిన్నంగా కంటెంట్ బేస్డ్ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదల ఆట నుండి మంచి రెస్పాన్స్‌ను రాబట్టకుని విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. చిన్న చిత్రానికి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. డిఫరెంట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది“ అన్నారు.