Project K: ‘ప్రాజెక్ట్ కె’ నటీనటుల పారితోషికాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రభాస్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీస్ లో ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఒకటి. 2020 లో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. అశ్వినీదత్ నిర్మాత. అయితే నిర్మాణ వ్యవహారాలు అన్నీ అతని కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్ లే చక్కబెడుతున్నారు. సెట్స్ లో ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తీర్చి దిద్దుతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎప్పుడో చెప్పాడు.

తాను చెప్పినట్టుగానే ఇంటర్నేషనల్ మార్కెట్స్ టార్గెట్ చేస్తూ (Project K) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు. ఇటీవల కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ఈ చిత్రం టైటిల్ లాంచ్ ఈవెంట్ ను ఓవర్సీస్ లో నిర్వహించబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. కేవలం ‘ప్రాజెక్ట్ కె’ పారితోషికాలకే ఏకంగా రూ.163 కోట్లు ఖర్చవుతుందట.

అది కూడా ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ల పారితోషికాలకి మాత్రమే కావడం గమనార్హం. ప్రభాస్ ఈ చిత్రం కోసం ఏకంగా రూ.100 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. ఇక కమల్ హాసన్ కి రూ.25 కోట్ల వరకు పారితోషికం ఫిక్స్ చేశారట. హీరోయిన్ దీపికా పదుకొనె కి రూ.15 కోట్లు, అమితాబ్ కి రూ.15 కోట్లు, మరో హీరోయిన్ దిశా పటానికి రూ.5 కోట్లు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కి రూ.3 కోట్లు పారితోషికాలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఓవరాల్ గా రూ. 163 కోట్లు వీళ్ళ పారితోషికాలకే ఖర్చవుతున్నట్టు తెలుస్తుంది. ఇక టెక్నికల్ టీంకి, డైరెక్టర్ కి, మిగిలిన నటీనటులకు ఇంకెంత పారితోషికాలు ఇస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా ఈ చిత్రం బడ్జెట్ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అశ్వినీదత్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus