Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

  • June 26, 2026 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘వారణాసి’ సినిమాకు సంబంధించి మీడియాలో కాస్త సందడి తగ్గడం ఆలస్యం.. ఆ సినిమా టీమ్‌ నుండి ఎవరో ఒకరి ఇంటర్వ్యూ బయటకు వచ్చేస్తోంది. తాజాగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇంటర్వ్యూ ఒకటి మీడియాలోకి, సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. అందులో ఆయన సినిమా గురించి, ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకాశానికెత్తేశారు. రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదని.. మంచి నటుడని ప్రశంసించారు.

Prithviraj Sukumaran

మహేశ్‌ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. కానీ ఇప్పుడు ప్రచార వీడియోలు, ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అలా వచ్చిన ఓ వీడియలోనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పొగడ్తల కార్యక్రమం జరిగింది. మోహన్‌లాల్ తర్వాత దర్శకుడు రాజమౌళి కూడా అంత గొప్ప నటుడిగా కన్పించారు అని మెచ్చేసుకున్నారు.

Prithviraj Sukumaran As Kumbha Look From SSMB29 Movie

సెట్స్‌లో ఏదైనా సీన్ వివరించేటప్పుడు ఆ పాత్రలో రాజమౌళి లీనమవుతారని, ఆ సీన్‌కు కావాల్సిన ఎమోషన్స్‌ అన్నీ స్వయంగా ఆయనే ముఖంలో పలికిస్తారని చెప్పారు. ఆ సన్నివేశం ఎలా చేయాలో, ఆ భావోద్వేగాలు ఎలా ఉండాలో నటులకు అర్థం కావడం కోసం ఆయన పాత్రలో జీవించి చూపిస్తారని మెచ్చేసుకున్నారు. ఒక్కోసారి రాజమౌళి చెప్పిన సన్నివేశాలు అర్థమయ్యేవి కాదని, దాన్ని అర్థం చేసుకోవడానికి శ్రమించాను. ఆయన విజన్‌కు, తన నటనకు మధ్య సెట్స్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగిందని అన్నారు పృథ్వీరాజ్‌.

అయితే రాజమౌళిపై నమ్మకంతో ఆయన చెప్పిందే చేశానని, చేస్తానని చెప్పారు. రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని ఇప్పటివరకు చూడలేదన్నారాయన. రాజమౌళి ప్రతి సినిమాను మొదటి సినిమాలా భావించి కష్టపడతారని అందరూ చెప్పే మాటే మళ్లీ చెప్పారు. ఒక్కోసారి సీన్‌ ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకూ జరుగుతుందని, ఆయన అనుకున్నట్లు రాకపోతే.. మరుసటి రోజు కూడా అదే సీన్‌ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇలా చేస్తారనే రాజమౌళిని తారక్‌ జక్కన్న అని పిలుస్తారు మరి.

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prithviraj Sukumaran
  • #SS Rajamouli
  • #Varanasi

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

23 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

23 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

34 mins ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

1 hour ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version