శ్రీదేవి కూతురి డ్రస్ పై విమర్శలు గుప్పించిన నెటిజనులు

హీరోయిన్స్ అందంగా అలంకరించుకొని పబ్లిక్ లోకి వస్తే కళ్లప్పగించి చూసే అభిమానులే.. శృతిమించి అందాలను ప్రదర్శిస్తే మాత్రం అదే నోటితో విమర్శలు గుప్పిస్తారు. ఈ విషయం రీసెంట్ గా శిల్పా శెట్టి విషయంలో రుజువైంది. ఈ పొడుగు కాళ్ల సుందరి తన కొడుకుతో కలిసి ముంబై వీధుల్లో తిరుగుతున్నప్పుడు పంజాబీ డ్రస్ వేసుకుంది కానీ.. ప్యాంట్ వేసుకోలేదు. ఆమె వాలకాన్ని ఒకరు ఫోటో తీసి నెట్లో పెట్టారు. ఇంకేముంది శిల్పా అవతారంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి మరిచిపోకముందే అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ నెటిజనుల ఆగ్రహానికి గురైంది.

దఢక్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే వందకోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో అద్భుతమైన కథల ఎంపికలో బిజీగా ఉంది. అంతేకాకుండా ఫ్యాషన్ డ్రసులతో పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తోంది. అయితే ఆమె నిన్న వేసిన బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ డిజైనర్ వేర్ కి మాత్రం మైనస్ మార్కులు వచ్చాయి. ఆ డ్రస్ మీద కోట్ వేసి .. కింద ప్యాంట్ వేయకపోవడంతో అసహ్యంగా కనిపిస్తోంది. ఆ విషయాన్ని చెబుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇదివరకు అనేకసార్లు పొట్టి డ్రస్సులతో కనిపించి విమర్శలు ఎదుర్కున్న కపూర్ ఫ్యామిలీ భేటీ ఈ విమర్శలను పట్టించుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus