పునర్నవి భూపాళం.. ‘ఉయ్యాల జంపాల’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన ఈ తెలుగమ్మాయి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లో శర్వానంద్ కూతురిగా నటించి మెప్పించింది. తర్వాత ‘ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ’, ‘పిట్టగోడ’, ‘అమ్మకు ప్రేమతో నీ సాధిక’, ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలు చేసింది. చివరిగా 2021లో ‘సైకిల్’ చిత్రంలో కనిపించింది. తర్వాత కొత్తవేవీ ప్రకటించలేదు.
కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులుగా విదేశాల్లో ఉంటుంది. అక్కడ తీసుకున్న పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుని అలరిస్తుంది. తను పోస్ట్ చేసిన పిక్చర్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తనను 528K మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం తాను లండన్‌లో ఉన్నట్టు క్యాప్షన్ ఇచ్చింది పునర్నవి భూపాళం.. ‘మళ్లీ సినిమాలెప్పుడు చేస్తావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!