‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగానూ కర్ణాటక ప్రజల, అభిమానుల మనసుల్లో చెరుగని ముద్రవేశారు.. మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పునీత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ‘చక్రవ్యూహ’ ఇప్పుడు తెలుగునాట ‘సివిల్ ఇంజనీర్’ పేరుతో రిలీజ్ కానుంది.
దసరాకి టీజర్ విడుదల చెయ్యగా మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు ట్రైలర్ చూపించారు. రచితా రామ్ హీరోయిన్ గా నటించగా.. తమిళ్ స్టార్ అరుణ్ విజయ్ విలన్ గా కనిపించాడు. ఎమ్.శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కన్నడ సూపర్ స్టార్, ‘కిచ్చా’ సుదీప్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. సొసైటీలోని ఒక బర్నింగ్ ఇష్యూ మీద హీరో ఎలా పోరాడి, మార్పు తీసుకొచ్చాడనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కించారని అర్థమవుతోంది.
పునీత్ సివిల్ ఇంజనీర్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ చూసి తెలుగులోని పునీత్ ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కీ, పునీత్ కీ మధ్య మంచి అనుబంధం ఉంది.. దాని కారణంగానే తారక్ ఈ మూవీలో ’గెలయా గెలయా’ అనే సాంగ్ పాడాడు. తన తల్లి కర్ణాటకి చెందిన వ్యక్తి కావడంతో తనకి చిన్నప్పటినుండే కన్నడ భాష తెలుసు..
దీంతో సునాయాసంగా, అద్భుతంగా జూనియర్ పాడిన సాంగ్ కన్నడిగులు, పునీత్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించాడు. సితార, అభిమన్యు సింగ్, సాధు కోకిల తదితరులు కీలకపాత్రల్లో నటించిన ‘చక్రవ్యూహ’ 2016లో అత్యధిక వసూళ్లు సాధించింది. త్వరలో ‘సివిల్ ఇంజనీర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!