పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘జేమ్స్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని నెలల క్రితమే పునీత్ మరణించడంతో అతడి చివరి సినిమాగా దీనికి ఎనలేని ప్రాధాన్యం వచ్చింది. పైగా పునీత్ పుట్టినరోజు నాడు మార్చి 17న ఈ సినిమాను విడుదల చేశారు. దక్షిణాది అంతటా ‘జేమ్స్’ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కర్ణాటకలో ఈ సినిమా విడుదల సందర్భంగా నెలకొన్న హడావిడి మాములుగా లేదు. పునీత్ గౌరవార్ధం ఈ వారంలో మరే కొత్త సినిమా విడుదల చేయడం లేదు కన్నడ సినీ ఇండస్ట్రీ.
ఆల్రెడీ థియేటర్లో ఉన్న సినిమాలకు కూడా తీసేశారు. కర్ణాటకలో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ సినిమానే రిలీజ్ చేశారు. కర్ణాటకలో తొలిరోజు అత్యధిక స్క్రీన్లలో, అత్యధిక షోలు ప్రదర్శితమైన సినిమాగా ‘జేమ్స్’ రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సినిమాకి తెల్లవారు జామున షోలు పడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మోత మొదలైంది. తొలిరోజు కన్నడ సినిమాల వసూళ్ల రికార్డులన్నింటినీ ‘జేమ్స్’ బద్దలు కొట్టేసినట్లు కనిపిస్తోంది.
కన్నడ ఇండస్ట్రీలో నటీనటులు, అందరి అభిమానులు దీన్ని తమ సినిమాగా ఆదరిస్తున్నారు. ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణమే కనిపించింది. కేవలం థియేటర్ల దగ్గరే కాదు.. కర్ణాటకలో అంతటా ప్రతి వీధిలోనూ పునీత్ ఫ్లెక్సీలు వెలిశాయి. పునీత్ చివరి సినిమా కావడంతో.. సెలబ్రేట్ చేసుకుంటూనే, అతడి జ్ఞాపకాలతో బాగా ఉద్వేగానికి గురయ్యారు ఫ్యాన్స్. ఎన్నో థియేటర్లు పునీత్ అభిమానులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశాయి. థియేటర్లను మునుపెన్నడూ లేని స్థాయి ముస్తాబు చేశారు అభిమానులు. థియేటర్ల లోపల పునీత్ ఎంట్రీ సీన్ కు వస్తోన్న రెస్పాన్స్ మామూలుగా లేదు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!