కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణానంతరం ‘కర్ణాటక రత్న’ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ విషయాన్నీ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. పునీత్ అక్టోబర్ 29న బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ లో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగుళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ లో అంత్యక్రియలు నిర్వహించారు. నటుడిగా అలరిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు పునీత్.
వేల మంది పిల్లలకు విద్యాదానం చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు. అనాథశ్రమాలు, వృద్దాశ్రమాలు, గోశాలలు నిర్మించారు. నటుడిగా ఎంత పెద్ద స్టార్ అయినా.. సింపుల్ గా ఉండేవారు. సమాజం కోసం పునీత్ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అతడిని ‘కర్ణాటక రత్న’ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ విషయంలో పునీత్ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!