Puneeth Rajkumar: పునీత్ చివరి మూవీ పై అతని భార్య స్పందన ఇది..!

దివగంత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ చిత్రం మార్చి 17న విడుదలైంది.ఆరోజు అతని జయంతి కావడంతో ‘జేమ్స్‌’ మూవీని విడుదల చేసింది చిత్ర బృందం. అప్పు ఫ్యాన్స్‌ ఈ చిత్రం చూడ్డానికి ఎగబడ్డారు.కన్నడలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఉదయం 6 గంటల నుండీ జనాలు థియేటర్ల వద్ద క్యూలు కట్టడం విశేషం.’ఆర్.ఆర్.ఆర్’ మార్చి 25న విడుదల అవ్వుతుంది కాబట్టి అప్పటి వరకు కర్ణాటకలో అన్ని థియేటర్లో ‘జేమ్స్‌’ మూవీని మాత్రమే ప్రదర్శించబోతున్నారు.

అప్పుని చివరి సారిగా తెర పై చూడడం ఒక విధంగా వారిని సంతోష పెడితే.. సినిమా ఎండింగ్ టైంకి వారిని బాధపెట్టింది అని కూడా చెప్పాలి. అలా అని సినిమా బాలేదు అని కాదు.. మూవీ బాగానే ఉంది, రిజల్ట్ తో సంబంధం లేకుండా పునీత్ పై ప్రేమతో, గౌరవంతో ఈ సినిమాని చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ.. కాబట్టి వాళ్ళు పునీత్ కొత్త సినిమాలను ఇక మీదట చూడలేరు కాబట్టి ఆ రకంగా బాధపడ్డారు అని చెప్పాలి.

అయితే ఈ పునీత్ చివరి చిత్రాన్ని ఆమె భార్య అశ్విని మాత్రం చూడలేదట. ఆమె మాట్లాడుతూ.. ” ‘జేమ్స్’ మూవీని నేను చూడలేను. ఎందుకంటే అందరిలా పునీత్ ను చూస్తే.. తట్టుకోలేను. జేమ్స్‌ మూవీ బాగా వచ్చిందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా ఆయన నాకు వివరించారు.ఇండస్ట్రీలో అన్ని రంగల్లోనూ కొత్తవారికి అవకాశాలు కల్పించాలనేది పునీత్ ఆశయం.

‘మా సంస్థ పీఆర్‌కే(పునిత్‌ రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్‌) ద్వారా ఇది కొనసాగుతూనే ఉంటుంది. మా బ్యానర్‌ నుండీ వచ్చిన ప్రతి సినిమా సక్సెస్‌ కాకపోయాన మా బెస్ట్‌ ఇవ్వగలిగాం ఇవ్వగలుగుతాం. అప్పును కోల్పోయిన బాధలో ఉన్న మాకు ఆయన అభిమానులు అండగా నిలిచారు. ఆయన బర్త్‌ యానివర్సరీ రోజున రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రమాల ద్వారా అప్పును బతికించారు’ అంటూ అశ్విని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus