పునీత్ విగ్రహాన్ని బెంగుళూరు తరలించేందుకు భారీ ఏర్పాట్లు..

దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. అంత చిన్న వయసులో ఆయన చేసినన్ని సేవా కార్యక్రమాలు మరెవరూ చేసుండరు. గతేడాది అక్టోబర్ 29న పునీత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఇంకా నమ్మలేకపోెతున్నారు. పునీత్ రాజ్ కుమార్‌ మొదటి వర్థంతిని పురస్కరించుకుని, ఒకరోజు ముందుగా అక్టోబర్ 28న ఆయన నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని కర్ణాటకలో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

అక్టోబర్ 27 రాత్రి బెంగుళూరులో ప్రీమియర్ షోకి వచ్చిన సెలబ్రిటీలంతా పునీత్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకి పన్నుమినహాయింపు ఇచ్చింది అక్కడి గవర్నమెంట్. పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ యానివర్సరీకి కన్నడ ప్రజలంతా ఘననివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా పునీత్ జ్ఞాపకార్థం 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఫైబర్‌ గ్లాస్‌‌తో పునీత్ రాజ్ కుమార్ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు.

21 అడుగుల ఎత్తులో ‘3డి’ టెక్నాలజీతో, నాలుగు నెలలపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం తెనాలిలోని స్థానిక సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా నిలిపారు.

ఇటీవల ఈ విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించి, అద్భుతంగా విగ్రహాన్ని తయారుచేసిన కళాకారులను అభినందించారు. నవంబర్ 1న జరుగబోయే పునీత్ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఇతర రాష్ట్రాలనుండి, ఇండస్ట్రీల నుండి సినీ ప్రముఖలు, అభిమానులు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

1

2

3

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus