తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకుల్లో ఎప్పటికీ గుర్తిండి పోయే డైరక్టర్ పూరి జగన్నాథ్. అంత పేరు రావడానికి కారణం అతని మేకింగ్ స్టైల్. ఏ విషయాన్నీ అయినా వెండితెరపై సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. అంతేకాదు అతనిలో సినిమాలో యువతకు నచ్చే ఫస్ట్, బెస్ట్ పాయింట్.. హీరో, హీరోయిన్లు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే విధానం. పూరి జగన్ సినిమాల్లో టాప్ ఎయిట్ లవ్ ప్రపోజల్స్ పై ఫోకస్…
ఓ గంట ఆగి చెప్పనా ..రవితేజ కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం ఇడియట్. ఇందులో రవితేజ రక్షితను చూసిన వెంటనే ఐ లవ్ యూ చెబుతాడు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి అని ఆశ్చర్యపోతుంది. ఓ గంట ఆగి చెప్పనా .. ఎప్పుడు చెప్పినా ఒకటే.. అనే సీన్ నేటి యువకుల స్పీడ్ ని ప్రతిబింభిస్తుంది.
అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తుందా..పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ఎవరైనా వంట చేస్తావా.. బట్టలు ఉతుకుతావా అని ఆడుతారు. ఆ కాలం ఎప్పుడో పోయిందని పూరి జగన్నాథ్ “అమ్మ నాన్న తమిళ అమ్మాయి” సినిమాలో చూపించారు. ప్రేమించిన అమ్మాయిని హీరోతో.. అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తావా .. అంటూ డిఫరెంట్ గా అడిగించి హిట్ కొట్టారు.
ఈరోజుల్లో అందరూ ముదుర్లేనండీ..ప్రేమించుకున్న వారు.. ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి మంచి మాటలను ఉపయోగిస్తారు. పోకిరి చిత్రంలో పూరి మాత్రం.. “ఈరోజుల్లో అందరూ ముదుర్లేనండీ” అంటూ హీరోయిన్ చేత చెప్పించి థియేటర్ నిండా చప్పట్లు నింపారు. గోల్కొండ పైన మహేష్, ఇలియానా లవ్ సీన్ సూపర్ గా ఉంటుంది.
నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా..సన్యాసితో ఓ కుర్రోడు ప్రేమలో పడ్డాడు. ఆమెకి లవ్ ని ఏ రూట్ లో లో చెబితే అర్ధమవుతుందో అలాగే దేశముదురు సినిమాలో చూపించారు పూరి జగన్నాధ్. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా.. నువ్వు ఎప్పుడు టెంప్ట్ అయినా ఫోన్ చెయ్ ఎత్తుకు వెళ్ళిపోతా.. అంటూ అల్లు అర్జున్ చెబుతుంటే విజిల్సే.. విజిల్స్.
ఒక సారి చెప్పవే..ఎవరూ లేని కుర్రోడికి ఓ అమ్మాయి ఐ లవ్ యూ చెబితే.. ఆ అబ్బాయికి ఆనందంతో ఏడుపు వస్తుంది. అనాధగా ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ లో హీరోకి హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసే సీన్ కంటినిండా నీళ్లు తెప్పిస్తుంది.
బీర్లు తాగితే ఎవడు పెళ్లి చేసుకుంటాడు..దైర్యం కోసం బీరు తాగి అమ్మాయి ముందుకు అబ్బాయి వెళ్లడం కామన్.. దీనిని రివర్స్ చేస్తే.. ఊహించలేం. అటువంటి ఊహలను తెరపైన ఆవిష్కరించడంలో పూరి ముందు ఉంటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా పవన్ కళ్యాణ్ కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ విభిన్నంగా ఉంటుంది.
నా పెళ్లానికి కుక్కనవుతా..ప్రేమను పూలతోనో.. ప్రకృతితోనో పోలుస్తాం.. పూరి మాత్రం కుక్కతో పోల్చారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చేత “నా పెళ్లానికి కుక్కనవుతా..” అంటూ ప్రేమను అగ్రెసివ్ గా వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ ని ఇదివరకు చూడని విధంగా చూపించారు.
నచ్చితే ముద్దు ఇవ్వచ్చుగా..అమ్మాయి నచ్చితే.. నీతో మాట్లాడాలని ఉంది.. కాఫీ తాగాలని ఉంది అడుగుతారు. హార్ట్ ఎటాక్ సినిమాలో పూరి హీరో ఏకంగా కిస్ అడిగాడు. “నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే .. అది మాటల్లో చెప్పలేక ముద్దు అడిగాను..” అంటూ పాట ద్వారా లవ్ ప్రపోజ్ చేయించారు.
తాళి కట్టేస్తాను..వివరాలు తెలుసుకొని ప్రేమ పుట్టదు.. ప్రేమించాక ఆ అమ్మాయి వివరాలు తెలిస్తే .. ఎవరైనా ఆలోచిస్తారు. పూరి హీరో మాత్రం ఏ ఆలోచన చేయడు.. ఏకంగా తాళి కట్టేస్తాడు.. అటువంటి ప్రేమను డాషింగ్ డైరక్టర్ ఇజం మూవీలో చూపించారు.
రోగ్ లో ఎలా ఉంటుందో..తాజాగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ మూవీ ట్రైలర్ దశలోనే యువతను పిచ్చెక్కిస్తోంది. ఇందులో ప్రేమను హీరో ఎలా వ్యక్తం చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.