Puri Jagannadh: వాడి వల్లే మేము రోడ్డున పడ్డాం!: పూరి తల్లి

  • January 31, 2024 / 04:21 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పూరి జగన్నాథ్ గురించి తాజాగా తన తల్లి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పాలి. ఈయన డైరెక్టర్ గా మారిన తర్వాత ఒకానొక సమయంలో రోడ్డున పడే పరిస్థితిలో కూడా వచ్చాయి.

ఈ విషయాల గురించి తన తల్లి మాట్లాడుతూ.. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరికి రాకూడదని ఏమీ తెలిపారు. ఏడవ తరగతి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్నటువంటి వాడు డిగ్రీ పూర్తి చేయగానే హైదరాబాద్ వచ్చారని తెలిపారు. హైదరాబాద్ వచ్చి కాళ్లు అరిగేలా ఎన్నో ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా డైరెక్టర్ కాకముందు నేను ఒకసారి హైదరాబాద్ వచ్చాను.

అప్పుడు నా కొడుకును చూడగానే నాకు ఏడుపొచ్చింది కాళ్లు మొత్తం వాచిపోయాయి కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా వీలు కాలేదని ఈమె తెలిపారు. ఆ క్షణం తల్లిని చూసి ఇంత కష్టం మనకు వద్దు ఊరికి వెళ్ళిపోదాం అక్కడ పొలం పనులు చేసుకుందామని చెప్పాను కానీ తను రానన్నాడు కొన్నిసార్లు అన్నం తినకుండా నీళ్లు తాగి పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ఇక డైరెక్టర్ అయిన తర్వాత ఒక సినిమా షూటింగ్ సమయంలో తన వద్ద పనిచేసే ఓ కుర్రాడు 80 కోట్ల రూపాయలు కొట్టేసి తనని మోసం చేశారు. అదే సమయంలోనే సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా మా కుటుంబం పై పెద్ద పిడుగు పడిందని చెప్పాలి. ఆ దెబ్బకు ఒకేసారి ఐదు ఇల్లు అమ్మేసామని దాదాపు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఎదుర్కొన్న కష్టాల గురించి తన తల్లి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus