Puri Jagannadh: ‘లైగర్’ నష్టాన్ని ఇలా భర్తీ చేయనున్నారా..?

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటారు. తన తోటి డైరెక్టర్లు ఒక్కో సినిమా చేయడానికి ఏడాది, రెండేళ్ల సమయం తీసుకుంటుంటే.. పూరి జగన్నాధ్ మాత్రం కొన్ని వారాల్లో స్క్రిప్ట్ పూర్తి చేసి.. మూడు, నాలుగు నెలల్లో సినిమాలను కంప్లీట్ చేస్తుంటాడు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చాలా సినిమాలను ఇలా ఐదారు నెలల్లో పూర్తి చేసేసారు. అలాంటి ఈ దర్శకుడు ‘లైగర్’ సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించాల్సి వచ్చింది.

కరోనా, ఇతర కారణాల వలన ఆయన కొత్త సినిమా ‘లైగర్’ మాత్రం చాలా ఆలస్యమైంది. రెండేళ్లయినా.. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. మరో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారు పూరి జగన్నాధ్. ‘లైగర్’ సినిమా హిందీ పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు కరణ్ జోహార్ కి అప్పగించి.. విజయ్ దేవరకొండతోనే మరో సినిమా చేయబోతున్నాడు. అదే ‘జనగణమన’.

ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో మొదలుకాబోతుందట. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ చేయాలనుకుంటున్నారు. ఓ పక్క షూటింగ్ చేస్తూనే.. మరోపక్క ‘లైగర్’ తెలుగు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూడబోతున్నారట. ‘లైగర్’ బాగా ఆలస్యం కావడంతో పూరికి, విజయ్ కి జరిగిన నష్టాన్ని ‘జనగణమన’తో భర్తీ చేయాలని చూస్తున్నారు పూరి.

చాలా ఏళ్ల క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు విజయ్ దగ్గరకు స్క్రిప్ట్ వెళ్లింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus