Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ఓపెన్ లెటర్ వెనుక రీజన్ ఇదేనా?

లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన పూరీ జగన్నాథ్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే సంగతి తెలిసిందే. బయ్యర్ల నుంచి ఇబ్బందులు ఎదురవడంతో పూరీ జగన్నాథ్ ఓపెన్ లెటర్ ద్వారా షాకింగ్ కామెంట్లు చేశారు. నేను మోసం చేసింది ప్రేక్షకులను మాత్రమేనని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. సక్సెస్, ఫెయిల్యూర్ ఆపోజిట్ అనుకుంటాం కానీ ఈ రెండూ ఒకే ఫ్లోలో ఉంటాయని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

లైఫ్ లో ఏదీ శాశ్వతం కాదని పూరీ కామెంట్ చేశారు. జీవితంను సినిమాలా చూస్తే షో అయిపోయిన తర్వాత మరిచిపోవచ్చని పూరీ వెల్లడించారు. సక్సెస్ అయితే డబ్బులు వస్తాయని ఫెయిల్ అయితే జ్ఞానం వస్తుందని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో మనం కోల్పోయేది ఏమీ లేదని దేనినీ ఫెయిల్యూర్ గా చూడొద్దని పూరీ చెప్పుకొచ్చారు. లైఫ్ లో రిస్క్ చేయకపోతే అది లైఫ్ కాదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

హీరోలా బ్రతకాలంటే నిజాయితీగా ఉండాలని నిజాన్ని నిజమే కాపాడుకుంటుందని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. నేను నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ను మినహా ఎవరినీ మోసం చేయలేదని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. మళ్లీ ఇంకో సినిమా తీసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. చచ్చిన తర్వాత రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్ కు అభిమానుల సపోర్ట్ మాత్రం ఉందనే సంగతి తెలిసిందే.

తర్వాత సినిమాలతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసే సినిమాలను పూరీ జగన్నాథ్ తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తన మనస్సులోని అభిప్రాయాలను అభిమానులకు అర్థమయ్యేలా చెప్పాలని పూరీ జగన్నాథ్ ఈ ఓపెన్ లెటర్ రాశారని తెలుస్తోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus