సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చాలు ఫేట్ డిసైడ్ చెయ్యడానికి.. హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం.. తేడా వస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్ మీదకి వచ్చెయ్యడం అనేది కామన్.. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సంపాదించిందంతా ఒక్కసారిగా పోగొట్టుకుని అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చినా కానీ తట్టుకుని నిలబడ్డాడు.. అందుకే ఆయణ్ణి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటుంటారు.‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరకు….
అవే రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు, ఇక పూరి పని అయిపోయింది అన్నారు.. కట్ చేస్తే, ఆ సినిమాతో మళ్లీ దర్శకుడిగా ట్రాక్ లోకి వచ్చాడు.. నిర్మాతగానూ లాభాలు వచ్చాయి.. తర్వాత వచ్చిన ‘లైగర్’ అంచనాలు తలకిందులు చేసేసింది.. సినిమా దారుణంగా ఫెయిల్ అవడంతో నష్టపోయిన డబ్బు ఇమ్మని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పంపిణీ రంగానికి చెందిన ఓ వ్యక్తి పూరితో ఫోన్ లో జరిపిన సంభాషణ తాలుకు కాల్ రికార్డింగ్ బయట పెట్టడంతో ఫిలిం సర్కిల్స్ తో పాటు నెట్టింట ఇప్పుడీ విషయం వైరల్ గా మారింది..
‘‘ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?.. నేను ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.. అయినా ఇస్తున్నాను.. ఎందుకు?.. పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని.. నేను ఆల్రెడీ బయ్యర్స్ తో మాట్లాడడం జరిగింది.. ఒక అమౌంట్ ఇస్తామని చెప్పాం.. వాళ్లు ఒప్పుకున్నారు.. నెలరోజులు టైం అడిగాను ఎందుకంటే నాకు రావాల్సింది ఉంది.. ఇస్తాను అని చెప్పాక కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే.. ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు.. ఎందుకు ఇస్తున్నాం?.. పరువు కోసం ఇస్తున్నాం..
నా పరువు తియ్యాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. అయినా ఎగ్జిబిటర్స్ కీ, నాకూ సంబంధం ఏంటి?.. ఇక్కడ అందరం గ్యాబ్లింగ్ చేస్తున్నాం.. పేకాట ఆడుతున్నాం.. కొన్ని ఆడతాయ్, కొన్ని పోతాయ్.. పోతే నేను ఎవరినైనా అడుగుతున్నానా?.. వీళ్లు మగాళ్లలు కాదు, ఒక్కడు లేడిక్కడ.. అదే సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గర వసూలు చెయ్యడానికి నానా చంకలు నాకాలి నేను.. ‘పోకిరి’ దగ్గరినుండి ‘ఇస్మార్ట్ శంకర్’ దాకా..
బయ్యర్ల దగ్గరినుండి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి.. బయ్యర్స్ అసోసియేషన్ అవి నాకు వసూలు చేసి పెడుతుందా?.. పెట్టదు కదా.. ధర్నా చేస్తామంటున్నారు కదా చెయ్యనీ..ధర్నా చేసేవాళ్ల లిస్ట్ తీసుకుంటా.. వాళ్లకి తప్ప మిగతా వాళ్లందరికీ డబ్బులిస్తా’’.. అంటూ పూరి క్లారిటీగా చెప్పిన వాయిస్ నోట్ గురించి ఫిలింనగర్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ వర్గాల వారిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!