పైసా వసూల్ కోసం పూరీ సరికొత్త ప్రయోగం!!

టాలీవుడ్ లో నందమూరి నటసింహం రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయితే నట సింహం బాలయ్య తన 100వ చిత్రంగా ‘గౌతమీ పుత్ర శాతకర్ణిని ఎంచుకోవడం నిజంగా చాలా సాహసం అనే చెప్పాలి…బడా హీరోలు ఎందరో ప్రెస్టీజియస్ సినిమా అంటూ ఫక్తు కమర్షియల్ సినిమా కధను పక్క బాష నుంచి ఆర్వూ తెచ్చుకుని మరీ హిట్ అందుకుంటే…మన చరిత్రని సరికొత్త చరిత్రగా చూపిస్తూ…ఇండస్ట్రీ హిట్ అందుకున్న బాలయ్య సాహసం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి…ఇదిలా ఉంటే…అలాంటి పౌరాణిక కధలను ఎంచుకున్న బాలయ్య తన 101 సినిమాగా పైసా వాసూల్ ప్రకటించగానే నివ్వెర పోయారు అంతా….డిఫరెంట్ జోనర్ లలో ఉండే బాలయ్య – పూరీ జగన్నాథ్ ఇద్దరూ కలిసి పైసా వసూల్ అంటూ సినిమా ప్రకటించగానే సినిమా లోకం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది…అయితే ఇప్పుడు ఎక్కడ విన్నా…ఒకటే టాక్… పూరీ స్టైల్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ ని బాలయ్య తన స్టైల్ లో చెబితే ఎలా ఉంటుంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు…ఇదిలా ఉంటే….ఈ సినిమా దసరా బరిలో నిలవనుంది అన్న విషయంఅందరికీ తెలిసిందే.

అదే క్రమంలో…ఇప్పుడు పూర్తి మరో సరికొత్త ప్రయోగాన్ని మనకు అందించనున్నాడు….ట్రైలర్ కి తక్కువ , టీజర్ కి ఎక్కువగా ఉండే ఒక స్టంపర్ ని ఈ నెల 28 న బాలయ్యతో  విడుదల చేయిస్తున్నాడు… ఈ కొత్త ప్రయోగం బాలయ్య సినిమాతోనే మొదలు పెడుతున్నాడు పూరీ జగన్నాథ్. అయితే మరో పక్క ఈ టైటిల్ పై అపోహలు అవసరం లేదు అని…తన స్క్రిప్ట్ కి తగ్గట్టుగా సినిమా సాగుతుంది అనీ మధ్యలో ఫాన్స్ కోసం  మసాలా సాంగ్స్ .. భారీ యాక్షన్ సీన్స్ ను.. అదిరిపోయే డాన్స్ లు ఉంటాయి అనీ పూరీ చెబుతున్నారు. బాలయ్య ఫాన్స్ ని అసంతృప్తి పరిచే ప్రసక్తే లేదు అని పూరీ చెప్పడం విశేషం . ” బాలయ్య లో కొత్త కోణం చూడడానికి ఫాన్స్ సిద్దం కావాలి. బాలయ్య సినిమా అంటే ఉండే మాస్ కంటే మరింత మాస్ + డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఫాన్స్ కి ఈ కొత్త ప్రయోగం సంతోషాన్ని ఇస్తుంది ” అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. మొత్తంగా చూసుకుంటే బాలయ్య రేంజ్ తగ్గకుండా సినిమాని చూపిస్తాడు పూరీ అని ఆశపడుతున్నారు ఫాన్స్…మరి వారి ఆశలను పూరీ స్యాటిస్ఫై చేస్తాడో లేదో చూద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus