టెంపర్ విజయం తర్వాత స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ని అపజయాలు వెక్కిరించాయి. జ్యోతి లక్ష్మి, లోఫర్ ఆశించినంతగా హిట్ కాకపోవడంతో విమ్మర్శలు ఎదుర్కొన్న పూరి వారందరికీ ఇజం మూవీ ద్వారా సమాధానం చెప్పారు. నందమూరి కళ్యాణ్ రామ్ ని పూర్తిగా డిఫెరెంట్ గా చూపించి హిట్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని భావించారు. అయితే దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తారక్, పూరి కాంబినేషన్లో చిత్రం ఉంటుందా? లేదా? అనేది వారిద్దరితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత కళ్యాణ్ రామ్ కూడా నోరు మెదపడం లేదు. తాజాగా పూరి బ్యాంకాక్ వెళ్లడంతో ఈ టాపిక్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. తారక్ సినిమా స్క్రిప్ట్ రాయడం కోసమే పూరి అక్కడికి వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి.
కొంతమంది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు జనగణమన స్క్రిప్ట్ రాసేందుకు వెళ్లారని చెబుతున్నారు. మరి వీటిలో ఏది కరెక్టో తెలుసుకోవాలంటే మరో రెండు వారాలు ఆగితే సరిపోతుంది.