నాగార్జున-నాగచైతన్య హీరోలుగా పూరీ జగన్నాధ్ చిత్రం!

నాగార్జున-పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో “శివమణి, సూపర్” సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కనుంది. “మెహబూబా” విడుదలకి ముందు పూరీ జగన్నాధ్ స్వయంగా నాగార్జున ఒక కథ చెప్పగా ఆ కథ విపరీతంగా నచ్చడంతో వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు నాగార్జున ఒకే చెప్పాడట, అయితే.. “మెహబూబా” రిజల్ట్ కారణంగా ఆ సినిమా ఆగిపోతుందేమో అనుకొన్నారందరూ.

కానీ.. కథ నచ్చితే దర్శకులను అమితంగా నమ్మే నాగార్జున ఆల్రెడీ కమిట్ అయిన “బంగార్రాజు” షూటింగ్ పూర్తయ్యాక పూరీ జగన్నాధ్ తో సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమని చెప్పాడట. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో నాగార్జున-నాగచైతన్య కలిసి నటించబోతున్నారు. “మనం” తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమా ఇదే.

ఇకపోతే.. నాగార్జున “బంగార్రాజు” కంప్లీట్ అయ్యేలోపూ పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ తో మరో సినిమా పూర్తి చేసి ఆ తర్వాత నాగార్జున సినిమా మొదలుపెడతాడట. సో, నెక్స్ట్ ఇయర్ లో ఈ అక్కినేని-పూరీ మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్లొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus