అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వీకెండ్ ని అద్భుతంగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా… వీక్ డేస్లో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సోసోగానే కలెక్ట్ చేసింది. కానీ నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఉంది.కేరళలో మాత్రం సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.
అక్కడ మాత్రం వీక్ డేస్లో చాలా డౌన్ అయ్యింది. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule ) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 60.90 cr |
సీడెడ్ | 24.38 cr |
ఉత్తరాంధ్ర | 15.37 cr |
ఈస్ట్ | 8.38 cr |
వెస్ట్ | 6.91 cr |
కృష్ణా | 8.02 cr |
గుంటూరు | 10.93 cr |
నెల్లూరు | 5.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 139.94 cr |
కర్ణాటక | 27.70 cr |
తమిళనాడు | 7.70 cr |
కేరళ | 9.45 cr |
ఓవర్సీస్ | 81.00 cr |
నార్త్ | 163.79 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 429.58 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.429.58 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.175.42 కోట్ల షేర్ రావాలి.